పాల బుగ్గలతో ముద్దుగా ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్ తెలుసా?

Rashmika Mandanna Childhood Pics: ఫొటోలో ఉన్న ఈ చిన్నారి ఎవరో తెలుసా? క్యూట్ క్యూట్ బుగ్గలతో ముద్దొస్తున్న ఈ పాప.. ఇప్పుడు ఇండియన్ సినిమాను ఓ ఊపు ఊపేస్తోంది. అనేక భాషల్లో సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటూ ఏకంగా నేషనల్ క్రష్ బిరుదును సొంతం చేసుకుంది. ఇంతకీ ఈ పాప ఎవరో కాదు... 

  • Dec 14, 2021, 12:18 PM IST

Rashmika Mandanna Childhood Pics: కన్నడ చిత్రపరిశ్రమలో చిన్న సినిమాలకు హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. తన అందంతో 'నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా'గా ఎదిగింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు కన్నడ బ్యూటీ రష్మిక. 'ఛలో' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈమె.. అటు తెలుగు, కన్నడ చిత్రాలతో పాటు ఇటు తమిళం, హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. త్వరలోనే 'పుష్ప' సినిమాతో ఇండియన్ సినిమాను అలరించనుంది. ఆమెకు సంబందించిన చిన్ననాటి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.      


 

1 /5

కర్ణాటకలోని విరాజ్​పేట్​లో ఏప్రిల్ 5న జన్మించిన రష్మిక.. కూర్గ్​లో ప్రాథమిక విద్యాభ్యాసం, మైసూర్​లో ఉన్నత విద్యను అభ్యసించింది.  

2 /5

2016లో తన సినీ కెరీర్​ను ప్రారంభించింది. కన్నడలో తెరకెక్కిన 'కిరిక్ పార్టీ' ఈమె తొలి చిత్రం.  

3 /5

2018లో వచ్చిన నాగశౌర్య హీరోగా నటించిన 'ఛలో' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత 'గీతా గోవిందం', 'డియర్ కామ్రేడ్', 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ' వంటి చిత్రాలతో సందడి చేసింది  

4 /5

ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ సరసన 'పుష్ప', శర్వానంద్​తో 'ఆడవాళ్లు మీకు జోహార్లు' చిత్రాలు చేస్తోంది  

5 /5

సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా రూపొందుతోన్న 'మిషన్ మజ్నూ' చిత్రంతో బాలీవుడ్​లోనూ అడుగుపెట్టింది.