Mithuna Rasi 2025 To 2026 Full Prediction In Telugu: ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయిన మిథున రాశి వారి జాతకం పరంగా చూస్తే 2025వ సంవత్సరం మిశ్రమ లాభాలను అందించబోతోంది. గురు గ్రహ ప్రభావం సంపూర్ణంగా ఉన్న రాశి విషయానికొస్తే.. ఈ సంవత్సరంలో మిధున రాశిగానే భావించవచ్చు. ఈ రాశి వారికి గురు గ్రహ ప్రభావం అద్భుతంగా ఉంటుంది. దీనివల్ల ఈ వీరు ఈ సంవత్సరం మొత్తం ఎలాంటి పనులు చేసిన చాలా అనుకూలంగా మారుతాయి.
అలాగే మిథున రాశి వారికి మే 8వ తేదీ నుంచి చాలా విశేషమైన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా జనవరి నుంచి ఉగాది వరకు మిధున రాశిలో జన్మించిన వారికి అన్ని రంగాల్లో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. అంతేకాకుండా వీరు ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన గురు ప్రభావం వల్ల ఎప్పుడు పొందలేనంత కీర్తిని పొందుతారు. అలాగే మిథున రాశి వారికి ఈ సమయంలో రాణి బాకీలు కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వీరు లగ్జరీ వస్తువులను కొనుగోలు చేయడమే కాకుండా మానసికంగా చాలా బాగుంటారు. ఇక మే నెల నుంచి సెప్టెంబర్ నెల వరకు మిధున రాశి వారికి కొన్ని పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఓవరాల్ గా చూస్తే ఈ రాశి వారికి అంతా బాగున్నప్పటికీ కొన్ని కొన్ని సమస్యలు తప్పవు. ఇక ఈ రాశి వారికి నాలుగైదు నెలలు బాగుంటే.. మరో నాలుగు ఐదు నెలలు గురు ప్రభావం వల్ల కొన్ని సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది.
ముఖ్యంగా వ్యాపారాల రంగాల వారీగా చూస్తే.. 2025 సంవత్సరంలో సూపర్ మార్కెట్, పూజ స్టోర్స్, తీర్థయాత్రల ట్రావెలింగ్, జ్యువెలరీ రంగాల్లో స్థిరపడిన వారికి ఈ సమయం చాలా బాగుంటుంది. ఇక రోడ్ సైడ్ బిజినెస్, రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్, ఇతర బిజినెస్ రంగాల్లో ఉన్న వ్యక్తులకు కూడా మార్చి 11వ తేదీ వరకు అనుకున్న పనులు వెంటవెంటనే జరుగుతాయి. అంతేకాకుండా వీరు వ్యాపారాలు విస్తరించే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ఏప్రిల్ 15వ తేదీ నుంచి శని గ్రహ ప్రభావం వల్ల మిధున రాశి వారికి కొన్ని పనుల్లో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఎలాంటి ప్రయత్నాలు చేసినా ఇబ్బందులు తప్పవని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే మే 9 నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు మధ్యలో ఒక నెల ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఏమైనా పనులుంటే ఈ సమయంలోనే చేయడం చాలా మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే జూలై నెల కాస్త ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది కాబట్టి వీరు ఈ సమయంలోనే ఎలాంటి పెట్టుబడులైనా పెట్టుకోవడం మంచిది.
అక్టోబర్ 10వ తేదీ నుంచి నవంబర్ 26వ తేదీ వరకు కాస్త శని ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు జాగ్రత్తలు తీసుకుంటూ తల్లిదండ్రుల ఆరోగ్యం పై శ్రద్ధ వహిస్తూ తప్పకుండా జీవితంపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అలాగే శని ప్రభావం రాహు ప్రభావం వల్ల ఏప్రిల్ 16వ తేదీ నుంచి కోర్టు సంబంధిత సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ జీవితంలో ముందుకెళ్లడం ఎంతో మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇక రాజకీయ నాయకుల విషయానికొస్తే ఏప్రిల్ 15వ తేదీ నుంచి శని మార్పుల కారణంగా పదవుల కోసం ఎదురుచూపులు తప్పవని జ్యోతిష్యులు చెబుతున్నారు.
అక్టోబర్ నెల నుంచి నవంబర్ 26వ తేదీ వరకు రాజకీయ నాయకులకు కాస్త మంచి జరుగుతుంది. నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సమయంలో అవి లభించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా సంఘంలో వీరికి ప్రజాధరణ పెరిగి ఊహించని లాభాలు కలుగుతాయి. ఇక మీడియా రంగంలో ఉన్న వారికి ఈ సమయం కాస్త సామాన్యంగానే ఉంటుంది. సినిమా రంగం, ప్రింటింగ్ రంగం, సంగీత రంగంలో పనులు చేస్తున్న వారికి ఈ సమయం కాస్త యధావిధి గానే ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.