Rasi Phalalu 2023: డిసెంబర్ చివరి వార ఫలాలు..ఈ వీక్ పై చేయి ఈ రాశుల వారిదే..

Weekly Horoscope: డిసెంబర్ నెలలోని చివరి వారంలో జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన, గ్రహాలు, నక్షత్రాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఊహించని లాభాలు కలిగితే మరికొన్ని రాశుల వారికి నష్టాలు కలగబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

  • Dec 24, 2023, 17:34 PM IST


Rasi Phalalu 2023: డిసెంబర్ చివరి వారంలో జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇదే సమయంలో నక్షత్రాలు కూడా రాశి సంచారం చేయనున్నాయి. దీని కారణంగా కొన్ని ప్రత్యేక యోగాలు ఏర్పడబోతున్నాయి.

1 /5

డిసెంబర్ చివరి వారంలో నాలుగు గ్రహాలు ఆరు రోజుల వ్యవధిలో సంచారం చేయబోతున్నాయి కాబట్టి రాబోయే వారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సంచారాల కారణంగా ఏర్పడిన ప్రభావం మొత్తం 12 రాశుల వారిపై పడబోతోంది. ముఖ్యంగా 4 రాశుల వారిపై ప్రత్యక్షంగా ప్రభావం పడనుంది. దీనికి కారణంగా ఈ వారం కొన్ని రాశుల వారికి లాభాలు కలిగితే, మరికొన్ని రాశుల వారికి వారికి నష్టాలు కలుగుతాయి.  

2 /5

మేష రాశి వారికి డిసెంబర్ చివరివారం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సమయంలో ఆర్థికంగా భారీ లాభాలు పొందుతారు అంతేకాకుండా ఫ్రెండ్స్ తో కలిసి విహారయాత్రలకు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు ఈ వారం మొత్తం వీరు బిజీ బిజీగా ఉంటారు.  

3 /5

వృషభ రాశి వారు కూడా ఈ వారం చాలా బిజీగా ఉంటారు వీరు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతోపాటు వీరికి వృత్తిపరంగా చాలా రకాల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఎప్పటినుంచో ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.  

4 /5

సింహ రాశి వారికి డిసెంబర్ చివరి వారం కొన్ని ఒడిదుడుగులు ఎదురవుతాయి. ఈ సమయంలో వీరు పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. ఇక ఆర్థిక విషయానికి వస్తే.. ఇప్పటిలాగే మంచి లాభాలు కూడా పొందుతారు.

5 /5

ఈ వారం మిధున రాశి వారికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉండబోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో అనుకున్న పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు దీంతోపాటు వీరు కూడా విహారయాత్రలకు వెళ్లే ఛాన్స్ ఉంది.