RBI Summer Internship 2024: రిజర్వ్‌ బ్యాంకు సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌.. నెలకు రూ.20,000 స్టైఫండ్‌ పొందే సువర్ణావకాశం..

RBI Summer Internship programme 2024: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ కోసం దరఖాస్తులు ప్రారంభించింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులులు ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ www.rbi.org.in ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు డిసెంబర్‌ 15 చివరితేదీ. ఈ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ 2025 ఏప్రిల్ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
 

1 /7

RBI Summer Internship programme 2024: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ ప్రారంభించింది. ఇది నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్‌ క్షుణ్నంగా చదివి దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌కు కావాల్సిన అర్హత వివరాలు తెలుసుకుందాం.

2 /7

ఆర్‌బీఐ ఇంటర్న్‌షిప్‌ 2024 అర్హత.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇంటర్న్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు కలిగి ఉండాల్సిన అర్హత వివరాలు.. పోస్ట్‌ గ్రాడ్యూయేట్‌ కోర్స్‌ చేసి ఉండాలి. 

3 /7

మేనేజ్మెంట్‌, స్టాటిస్టిక్స్‌, లా, కామర్స్‌, ఎకనామిక్స్‌, ఎకానొమేట్రిక్స్‌, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ విభాగాల్లో 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ చేసి ఉండాలి.న్యాయ శాస్త్రంలో పొఫెషనల్‌ బ్యాచిలర్‌ డిగ్రీ ఫుల్‌ టైం చేసి ఉండాలి.  

4 /7

రిజర్వ్‌ బ్యాంక్‌ అధికారిక నోటిఫికేషన్‌ ప్రకారం కేవలం 125 మంది విద్యార్థులను మాత్రమే ఈ ఇంటర్న్‌షిప్‌కు ఆర్‌బీఐ ఎంపిక చేస్తుంది. సమ్మర్‌ లో ఈ ప్లేస్‌మెంట్స్‌ ఉంటాయి. జనవరి, ఫిబ్రవరీ నెలల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. అన్ని విభాగాల్లో అర్హత సాధించిన విద్యార్థుల పేర్లను షార్ట్‌లిస్ట్‌ చేస్తుంది.   

5 /7

ఆర్‌బీఐ వివిధ బ్రాంచీ ఆఫీసుల్లో వారికి ఇంటర్న్‌షిప్‌ అవకాశాన్ని కల్పిస్తుంది. ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ట్రావెలింగ్‌ ఖర్చులు భరించాల్సి ఉంటుంది. ఫిబ్రవరీ, మార్చి నెలల్లో ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల చేస్తారు.  

6 /7

ఆర్‌బీఐ సమ్మర్‌ 2024 ఇంటర్న్‌షిప్‌ స్టైపెండ్‌.. ఈ సమ్మర్‌ ఆర్‌బీఐ ఇంటర్న్‌షిప్‌ లో ఎంపికైన విద్యార్థులకు ప్రతినెలా రూ.20,000 స్టైపెండ్‌ లభిస్తుంది. ఇతర దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు కూడా తమ ట్రావెలింగ్‌ ఖర్చులను భరించాల్సి ఉంటుంది.

7 /7

రిజర్వ్‌ బ్యాంక్‌ సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ 2024 ముఖ్యమైన గైడ్‌లైన్స్‌ ఇవే.. ఫారమ్‌ క్షుణ్నంగా చదివిన తర్వాత విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత ఎలాంటి మార్పులు చేయరు. అప్లికేషన్‌ పూర్తిగా నింపాలి. ఫోటో, సిగ్నేచర్‌, కాలేజ్‌ ఆథారైజేషన్‌ లెట్టర్‌, బోనాఫైడ్‌ లేకుంటే దరఖాస్తును రిజెక్ట్ చేస్తారు. విద్యార్థులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి. చివరగా సర్వర్‌ డౌన్‌, ఇతర ఇంటర్నెట్ సమస్యలు ఎదురవుతాయి.