Realme Gt Neo 3 Price: దీపావళి సందర్భంగా అత్యంత చౌకగా realme GT Neo 3 మొబైల్‌..ఇలా రూ. 8,899కే పొందండి..

Realme Gt Neo 3 Price: అతి తక్కువ ధరలోని రియల్ మీ గేమింగ్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఫ్లిప్కార్ట్ గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. రియల్ మీ GT నియో 3 (realme GT Neo 3) స్మార్ట్ ఫోన్ ను 20 శాతం తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ ని కూడా అందిస్తుంది.

  • Nov 12, 2023, 17:27 PM IST


Realme Gt Neo 3 Price: దీపావళి ప్రత్యేక ఆఫర్ల సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో అన్ని ఎలక్ట్రిక్ వస్తువులపై 40 నుంచి 50 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా MRP ధరలపై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. గేమింగ్ స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశంగా భావించవచ్చు. ప్రముఖ టెక్ కంపెనీ రియల్ మీ ఇటీవల విడుదల చేసిన GT నియో 3 భారీ తగ్గింపుతో లభిస్తోంది.
 

1 /5

ఈ రియల్ మీ GT నియో 3 స్మార్ట్ ఫోన్‌ను భారీ తగ్గింపుతో పొందాలనుకునే వారికి ఫ్లిప్‌కార్ట్‌ దీపావళి సందర్భంగా ప్రత్యేక తగ్గింపు అందిస్తోంది. మొదటగా ఈ స్మార్ట్ ఫోన్ MRP ధర రూ.38,999కు విక్రయించేది. అయితే ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా 20 శాతం తగ్గింపుతో లభిస్తోంది.   

2 /5

రియల్ మీ GT నియో 3 స్మార్ట్ ఫోన్ ను ప్రత్యేక ఆఫర్లలో భాగంగా 20 శాతం తగ్గింపుతో కేవలం రూ.30,999కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా అదనంగా తగ్గింపు పొందడానికి బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.  

3 /5

ఈ GT నియో 3 (realme GT Neo 3) స్మార్ట్ ఫోన్ ను బ్యాంక్ ఆఫర్లలో భాగంగా కొనుగోలు చేయాలనుకునేవారు ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించి బిల్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డుతో బిల్ చెల్లిస్తే రూ.1,550 వరకు తగ్గింపు లభిస్తుంది.   

4 /5

ఈ realme GT Neo 3 స్మార్ట్ ఫోన్ ను మరింత తగ్గింపుతో కొనుగోలు చేయాలనుకునేవారు ఎక్స్చేంజ్ ఆఫర్ను వినియోగించాల్సి ఉంటుంది. మీరు వినియోగిస్తున్న బ్రాండెడ్ పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే దాదాపు రూ. 22,100 వరకు తగ్గింపు లభిస్తుంది. 

5 /5

ఇక ఈ realme GT Neo 3 స్మార్ట్ ఫోన్ బ్యాంక్ ఆఫర్స్, డిస్కౌంట్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ ఆఫర్ పోను రూ. 8,899కే పొందవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మీ పాత స్మార్ట్ ఫోన్ కండిషన్‌, బ్రాండ్‌ని బట్టి ఆధారపడి ఉంటుంది మీ స్మార్ట్ ఫోన్ కండిషన్ బాగుంటేనే ఫ్లిప్‌కార్ట్‌ అందించే బోనస్ లభిస్తుంది.