Prabhas Recent Movies Collections: బాహుబలి సిరీస్ సక్సెస్ తర్వాత ప్రభాస్ ప్యాన్ ఇండియా లెవల్లో తన మార్కెట్ పెంచుకున్నాడు. ప్రస్తుతం మన దేశంలో అసలు సిలసలు ప్యాన్ ఇండియా హీరోగా సత్తా చూపిస్తున్నాడు. అంతేకాదు సినిమా సినిమాకు ఆయన చిత్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పెరుగుతూ వస్తోంది. తాజాగా ‘కల్కి’ మూవీతో మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేసాడు. మొత్తంగా కల్కి సహా డార్లింగ్ లాస్ట్ 5 చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా ఎంత కలెక్ట్ చేసాయంటే..
కల్కి 2898 AD: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. ఈ సినిమా థియేట్రికల్ గా ప్రపంచ వ్యాప్తంగా రూ. 539.25 కోట్ల షేర్ రాబట్టింది. తెలుగు వెర్షన్ లో 302.52 కోట్ల షేర్ రాబట్టింది.
సలార్: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా యాక్ట్ చేసిన మూవీ ‘సలార్’. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ. 337.43 కోట్ల షేర్ రాబట్టింది. తెలుగులో రూ. 217.13 కోట్ల షేర్ రాబట్టింది.
ఆదిపురుష్: ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రభు శ్రీరాముడిగా యాక్ట్ చేసిన చిత్రం 'ఆదిపురుష్'. రామాయణాన్ని పూర్తిగా వక్రీకరించి తెరకెక్కించిన ఈ చిత్రం ఫ్లాప్ టాక్‌తో కూడా రూ. 200 కోట్ల షేర్ రాబట్టం విశేషం. తెలుగులో రూ. 109.50 కోట్ల డీసెంట్ షేర్ రాబట్టడం విశేషం.
రాధే శ్యామ్: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'రాధే శ్యామ్'. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 83.20 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. తెలుగులో రూ. 72.20 కోట్ల షేర్ రాబట్టింది.
సాహో: రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘రాధే శ్యామ్’. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 218.45 కోట్ల షేర్ రాబట్టింది. ఇందులో మెజారిటీ వాటా హిందీ నుంచే దక్కడం విశేషం. తెలుగులో మాత్రం రూ. 112.73 కోట్ల షేర్ తో సరిపెట్టుకుంది. మొత్తంగా సాహో నుంచి కల్కి మవరకు ప్రభాస్ మొత్తంగా రూ. 1375 కోట్ల షేర్ రాబట్టారు. ఒక్కో సినిమాకు యావరేజ్ గా రూ. 275.08 కోట్ల షేర్ వచ్చింది.
బాహుబలి 2: ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో యాక్ట్ చేసిన చిత్రం 'బాహుబలి 2'. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 860 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇప్పటి వరకు ఈ రేంజ్ మన దేశంలో కలెక్షన్స్ రాబట్టిన సినిమా ఏది లేదు. అంతేకాదు తెలుగులోనే కాదు మన దేశంలో హైయ్యెస్ట్ వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఒక్క తెలుగులోనే రూ. 320 కోట్ల షేర్ రాబట్టడం విశేషం.
బాహుబలి 1: రాజమౌళితో చేసిన బాహుబలి 1 సినిమాతో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 304 కోట్ల షేర్ రాబట్టింది. అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను ఈ సినిమా తిరగరాసింది. కేవలం తెలుగు భాషలోనే రూ. 194 కోట్ల షేర్ రాబట్టడం విశేషం.