Regina Cassandra Shocking Secret: రెజీనా కసాండ్రా ఈ మధ్యకాలంలో చాలా తక్కువగా పెద్ద తెరపై కనిపిస్తున్న ఈ అమ్మడు. వెబ్ సిరీస్ లో మాత్రం అలరిస్తుంది తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకున్న రెజీనా తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గర అయిపోయింది. అయితే, తన వ్యక్తిగత జీవితంపై రెజీ సంచనల వ్యాఖ్యలు చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలుగులోనే మాత్రమే కాదు తమిళ సినిమాలో కూడా నటించి మెప్పించింది అవార్డ్స్ ఫిలింఫేర్ అవార్డ్స్ దక్కించుకుంది రెజీనా. కెరీర్ మొదట్లో టీవీ యాంకర్ గా తన ప్రస్థానం మొదలుపెట్టిన రెజీనా ఆ తర్వాత 'కంద నాల్ ముదల్' అనే సినిమా తమిళ సినిమాలో ఆరంగేట్రం చేసింది.
తెలుగు సినిమాలోకి 'శివ మనసులో శృతి' (SMS) ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'రొటీన్ లవ్ స్టోరీ', ' పవర్', ' పిల్ల నువ్వు లేని జీవితం' వంటి చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది. ఇక 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' సినిమాలో సంప్రదాయ బద్ధంగా కనిపించింది.
అల్లు శిరీష్ తో 'కొత్తజంట' సినిమాలో కూడా నటించింది రెజీనా. 'ఎక్ లడిఖీ కో దేఖా తో ఐసా లగా' అనే హిందీ సినిమాలో కూడా నటించింది.
ప్రస్తుతం రెజీనా అజిత్ కుమార్ సరసన కథానాయక తమిళ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా రానున్న సంక్రాంతికి విడుదల కానుంది.
అయితే తన పర్సనల్ లైఫ్ గురించి ఇటీవల రెజీనా ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ విషయం బయటపెట్టింది. తను ముస్లిం నుంచి క్రిస్టియన్ లోకి మారడానికి అసలు కారణం చెప్పింది. ఇది నెట్టింట వైరల్ అవుతోంది.
రెజీనా నాన్న ముస్లిం అమ్మ, క్రిస్టియన్ వీళ్లు ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులు మనస్పర్థలతో విడాకులు తీసుకుని విడిపోయారు. దీంతో రెజీనా తన తల్లి వద్దే పెరిగింది.
ఆ తర్వాత తల్లితోనే ఉండాల్సి వచ్చింది. ఆమె తల్లికి ముస్లిం మతం గురించి పెద్దగా తెలియదు. దీంతో రెజీనా అంత వరకు ముస్లిం అమ్మాయిగా పెరిగిన రెజీనా క్రిస్టియన్ లోకి మారానని చెప్పుకొచ్చింది.