Royal Enfield Hunter 350: ఈ బైక్‌ని ఎగబడి మరీ కొంటున్న జనం.. 6 నెలల్లో లక్షకుపైగా బైక్స్ అమ్మకం

Royal Enfield Hunter 350 Price: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అంటే ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా ? రాయల్ ఎన్‌ఫీల్డ్.. పేరుకు తగినట్టుగానే ఇందులో ఏ వేరియంట్ అయినా సరే రాజసం ఉట్టిపడినట్టుగా ఉండే బైక్ అనేది కస్టమర్స్ భావన. అందుకే ధర ఎక్కువైనా సరే ఆ బైక్‌నే కొనాలి అని అనుకునే వారికి కొదువే ఉండదు. 

  • Feb 25, 2023, 20:24 PM IST

Royal Enfield Hunter 350:  ఆరు నెలల క్రితమే లాంచ్ అయిన రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్‌కి వస్తున్న పాజిటివ్ రియాక్షన్ చూస్తే ఆ విషయం వరికైనా ఇట్టే అర్థమవుతుంది. అవును.. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు లక్షకుపైగా బైక్స్ అమ్ముడయ్యాయని కంపనీ ప్రకటించింది.

1 /4

Royal Enfield Hunter 350 Price: రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్‌ ప్రారంభ ధర రూ. 1.50 లక్షలుగా ఉంది. 

2 /4

Royal Enfield Hunter 350 Varients: రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్‌ రెండు వేరియంట్స్‌లో లభిస్తుంది. అందులో ఒకటి రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మెట్రో వేరియంట్ కాగా.. రెండోది రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 రెట్రో వేరియంట్ బైక్.

3 /4

Royal Enfield Hunter 350 CC Specs: రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్‌ 349 CC సింగిల్ సిలిండర్ ఇంజన్, ఎయిర్ కూల్డ్ మోటార్ టెక్నాలజీతో రూపొందించినట్టు కంపెనీ స్పష్టంచేసింది.

4 /4

Royal Enfield Hunter 350 Bikes: కేవలం ఇండియాలోనే కాకుండా ఇండోనేషియా, జపాన్, కొరియా, థాయిలాండ్ వంటి దేశాల్లోనూ కంపెనీ ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్స్ ని విక్రయిస్తోంది.