Rules Change From 1st May 2024: గ్యాస్ సిలిండర్ల , బ్యాంక్ ఛార్జీలు.. రేపటి నుంచి ఈ భారీమార్పులు..

Rules Change From 1st May 2024: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే కొన్ని మార్పులు వల్ల సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంది. గ్యాస్, బ్యాంకు నియమాలతోపాటు ఏ ఏ నిబంధనల్లో భారీ మార్పులు రానున్నాయో ఎప్పటి నుంచి అమలు కానున్నాయో తెలుసుకుందాం.

1 /5

ప్రతి నెల కొన్ని నిత్యావసర వస్తువులపై ప్రత్యక్ష లేదా పరోక్ష ప్రభావం పడుతుంది. నేడు ఏప్రిల్ చివరిరోజు అయితే, రేపు మే డే ఈ సందర్భంగా కొన్ని భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా గ్యాస్, బ్యాంకు నిబంధనల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అవేంటో తెలుసుకుందాం.  

2 /5

రేపటి నుంచి అంటే మే మొదటి రోజు నుంచి ప్రైవేట్‌ సెక్టర్ బ్యాంక్‌ అయిన ఎస్ బ్యాంక్ కొన్ని నిబంధనలు మార్పు చేసింది. ఈ బ్యాంకులో సేవింగ్స్‌ ఖాతా నిర్వహించాలంటే కనీస బ్యాలన్స్‌ తప్పకుండా నిర్వహించాలి. లేదంటే అదనపు ఛార్జీలను వసూలు చేయనున్నారు. ఎస్‌ బ్యాంకులో కనీసం రూ.10 వేలు ఉండాలి. లేదంటే రూ.750 వరకు అదనపు ఛార్జీలను వసూలు చేయనున్నారు. ఈ నిబంధన మే 1 నుంచి వర్తించనుంది.  

3 /5

ఎల్‌పీజీ గ్యాస్‌ ధరలు ప్రతినెల మొదటి రోజు ఆయిల్ కంపెనీలు మార్పుల చేస్తాయి. ఇది దేశవ్యాప్తంగా వీటి ఛార్జీలు వర్తిస్తాయి. మే 1  రోజు నుంచి కూడా ఎల్పీజీ గ్యాస్‌ ధరలు మారుతాయి. గతంలో పెరిగిన గ్యాస్‌ ధరలకు కేంద్ర సర్కార్‌ రూ.100 రాయితీ ఇచ్చిన సంగతి తెలిసిందే.  రేపటి నుంచి ఎల్‌పీజీ గ్యాస్‌ ధరలు కూడా భారీ మార్పులు చోటు చేసుకుంటాయి.  

4 /5

సాధారణంగా అన్నీ పబ్లిక్‌, ప్రైవేటు బ్యాంకులు 60 ఏళ్లు పైబడిన వారికి అధిక శాతం వడ్డీ రేట్లను అందిస్తాయి. అయితే, హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్  సీనియర్ సిటిజెన్‌ ఎఫ్‌డీ పథకం 2020 లో ప్రారంభించింది. ఈ పథకానికి చివరి తేదీని కూడా పెంచింది. 2024 మే 10 వరకు ఈ వడ్డీ రేటును పొడిగించింది. ఈ పథకం అములును మరింత సమయం పెంచింది.  

5 /5

మే 1 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్‌ కూడా కొన్ని నిబంధనల్లో మార్పులు చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఖాతాదారులు వినియోగించే డెబిట్‌ కార్డ్‌ సర్వీసులకు రూ. 200, రూ. 99 పట్టణ, గ్రామీణ ప్రాంతాల బ్యాంకు కస్టమర్లకు వార్షిక ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు ఐఎంపీఎస్‌ డబ్బు చెల్లింపులు, చెక్‌ బుక్‌ నిర్వహణకు ఛార్జీల్లో సైతం భారీ మార్పులు చేసింది.