Iqoo Z10 Series: ప్రముఖ చైనీస్ కంపెనీ iQOO నుంచి మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ విడుదల కాబోతోంది. దీనిని కంపెనీ iQOO Z10 సిరీస్ ఎడిషన్ పేరుతో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇది ఎన్నో రకాల శక్తివంతమైన ఫీచర్స్‌తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో విడుదల చేసిన Z సిరీస్‌కు సక్సెసర్‌గా ఈ iQOO Z10 స్మార్ట్‌ఫోన్ సిరీస్ విడుదల కాబోతోంది.
ఇది 7000mAh బ్యాటరీతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇటీవలే సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
త్వరలోనే మార్కెట్‌లోకి విడుదల కాబోయే iQoo Z10 సిరీస్ రెండు మోడల్స్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది అద్భుతమైన డైమెన్సిటీ, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌లతో లాంచ్ కానుంది. అలాగే ఈ మోడల్స్ జంబో బ్యాటరీ సెటప్‌తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ iQoo Z10 Turbo స్మార్ట్‌ఫోన్ వివరాల్లోకి వెళితే.. ఇది స్నాప్‌డ్రాగన్ 8s ఎలైట్ చిప్‌తో లాంచ్ కానుంది. అంతేకాకుండా దీనిని కంపెనీ వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా కంపెనీ దీనిని చైనాలో విడుదల చేసి.. ఆ తర్వాత గ్లోబల్ లాంచింగ్ చేయబోతోంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 1.5K రిజల్యూషన్‌తో కూడిన డిస్ల్పేతో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ఫ్లాట్ OLED ప్యానెల్‌తో లాంచ్ కానుంది. దీంతో పాటు 7000mAh సామర్థ్యంతో సింగిల్-సెల్ సిలికాన్ బ్యాటరీతో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ మొబైల్ మార్కెట్‌లోకి విడుదలైతే Redmi Turbo 4 Proతో పోటీ పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనిని కంపెనీ అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.