Russia Cancer Vaccine: ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా కేన్సర్ వంటి మహమ్మారికి ఇంకా చికిత్స లేకపోవడంతో ప్రతి యేటా లక్షలాది మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా కేన్సర్ మందు లేదా వ్యాక్సిన్ కోసం పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ క్రమంలో రష్యా చేసిన ప్రకటన ఆశలు చిగురింపచేస్తోంది. కేన్సర్‌కు వ్యాక్సిన్ కనిపెట్టామని రష్యా ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ వ్యాక్సిన్‌ను 2025 నుంచి కేన్సర్ రోగులకు ఉచితంగా అందిస్తామని తెలిపింది. ఈ వ్యాక్సిన్ కేన్సర్ నియంత్రించేందుకు కాదు..కేన్సర్ రోగులకు చికిత్సలో అద్భుతంగా ఉపయోగపడనుంది. ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.
పర్సనలైజ్డ్ వ్యాక్సిన్ రష్యా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ పర్సనలైజ్డ్. అంటే రోగిని బట్టి వేర్వేరు వ్యాక్సిన్లు తయారవుతాయి. ఈ ప్రక్రియలో రోగి ఆర్ఎన్ఏ తీసుకుని దాని ఆధారంగా వ్యాక్సిన్ తయారు చేస్తారు.
వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది సాంప్రదాయ వ్యాక్సిన్లలానే ఈ వ్యాక్సిన్ కూడా కేన్సర్ సెల్స్ ఉపరితలంపై ఉన్న ప్రోటీన్ వినియోగించుకుంటుంది. ఈ యాంటీజెన్‌ను శరీరంలో ఇంజెక్ట్ చేస్తారు. తద్వారా రోగి ఇమ్యూనిటీ సిస్టమ్ ఈ ప్రోటీన్‌ను గుర్తించి యాంటీ బాడీ తయారు చేస్తుంది. కేన్సర్ సెల్స్ పై దాడి చేస్తాయి.
వ్యాక్సిన్ ఎలా చేస్తారు రష్యాకు చెందిన గామలేయ నేషనల్ రీసెర్చ్ సెంచర్ డైరెక్టర్ అలెగ్జాండర్ కీలక విషయాలు తెలిపారు. వ్యాక్సిన్ తయారీలో హై లెవెల్ టెక్నిక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించారు. ట్యూమర్ నుంచి సంగ్రహించిన డేటాతో వ్యాక్సిన్ తయారు చేస్తారు. వ్యాక్సిన్ తయారీకు కేవలం 30 నుంచి 60 నిమిషాలు పడుతుంది
ఏయే కేన్సర్‌లకు ఉపయోగం ఈ వ్యాక్సిన్ ఏయే రకాల కేన్సర్‌లకు పనిచేస్తుందో ఇంకా స్పష్టత లేదు. రష్యా ఈ విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. రష్యాలో ఎక్కువగా కోలన్, బ్లెస్ట్, లంగ్ కేన్సర్ రోగులు ఎక్కువగా ఉంటారు
వ్యాక్సిన్‌కు అయ్యే ఖర్చు ఈ వ్యాక్సిన్ ప్రతి డోసుకు దాదాపుగా 2.5 లక్షల రూపాయలు అవుతుంది. అయితే రష్యా ప్రజలకు ఈ వ్యాక్సిన్ ఉచితంగా అందించనున్నారు.