Russia-Ukraine War: రష్యా మిస్సైల్ దాడులతో ఉక్రెయిన్ పరిస్థితి ఎలా ఉందంటే

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది. స్వయంగా రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇతర దేశాలు జోక్యం చేసుకుంటే..తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని హెచ్చరించారు. ఉక్రెయిన్ మిలటరీ, వైమానిక స్థావరాల్ని లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేస్తోంది. అదే సమయంలో వెనక్కి తగ్గేది లేదని ఉక్రెయిన్ స్పష్టం చేస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధపు కొన్ని దృశ్యాలు మీ కోసం

Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది. స్వయంగా రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇతర దేశాలు జోక్యం చేసుకుంటే..తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని హెచ్చరించారు. ఉక్రెయిన్ మిలటరీ, వైమానిక స్థావరాల్ని లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేస్తోంది. అదే సమయంలో వెనక్కి తగ్గేది లేదని ఉక్రెయిన్ స్పష్టం చేస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధపు కొన్ని దృశ్యాలు మీ కోసం
 

1 /6

ఉక్రెయిన్‌లో యుద్ధ పరిస్థితులు నెలకొన్న తరువాత అక్కడి ప్రజలు పెద్దసంఖ్యలో దేశం వదిలేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఉక్రెయిన్ రోడ్లపై వేలాది వాహనాల క్యూ కన్పించింది. 

2 /6

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో రష్యా ఫైటర్ జెట్స్ చాలా కన్పించాయి. కీవ్ నగరంపై రష్యా మిస్సైల్ దాడులు కూడా జరిపిందని సమాచారం. 

3 /6

ఉక్రెయిన్ రాజధాని కీవ్, రష్యా సరిహద్దుకు ఆనుకుని ఉన్న నగరాల్లో ఉదయం నుంచే రష్యా ఎయిర్‌స్ట్రైక్స్ ప్రారంభించింది.

4 /6

ఉక్రెయిన్ కూడా రష్యాకు చెందిన 5 ఫైటర్ ఫ్లైట్లను, ఒక హెలీకాప్టర్‌ను కూల్చేసినట్టు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

5 /6

రష్యా..ఉక్రెయిన్ వైమానిక, మిలటరీ స్థావరాల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్టు తెలుస్తోంది. అటు ఉక్రెయిన్ కూడ దాడుల్ని తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తోంది. 

6 /6

యుద్ద ప్రకటన మొదలైన తరువాత ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో పేలుళ్లు భారీగా విన్పించాయి. రష్యా దాడులతో ముడి చమురు ధర బ్యారెల్ వంద డాలర్లకు చేరుకుంది.