Sachin Tendulkar House: బాబోయ్.. ఇది ఇల్లు కాదు.. అద్భుతమైన ప్యాలెస్.. సచిన్ టెండూల్కర్ ఇంటి పిక్స్ చూశారా..!

Sachin Tendulkar House Inside Pics: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన ఆటతీరు మైస్మరైజ్ చేసిన మాస్టర్ బ్లాస్టర్.. టీమిండియాకు ఎన్నో మ్యాచ్‌ల్లో ఒంటి చెత్తో విజయం అందించాడు. క్రికెట్‌కు దశాబ్దం క్రితమే వీడ్కోలు పలికిన టెండూల్కర్.. ముంబైలో నివాసం ఉంటున్నారు.
 

1 /9

సచిన్ టెండూల్కర్ తన ఫ్యామిలీతో కలిసి ముంబైలోని బాంద్రాలోని ఒక విశాలమైన భవనంలో నివసిస్తున్నారు.   

2 /9

భార్యా అంజలి టెండూల్కర్, కూతురు సారా టెండూల్కర్, కొడుకు అర్జున్ టెండూల్కర్‌తో కలిసి ఉంటున్న ఈ ఇల్లు పెద్ద బంగ్లాలా ఉంటుంది.  

3 /9

6 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో బహుళ అంతస్తులతో ఉంటుంది.  2007లో రూ.39 కోట్లకు కొనుగోలు చేయగా.. ఆ తరువాత అద్భుతంగా మార్చేశారు.  

4 /9

ప్రస్తుతం ఈ ప్యాలెస్ విలువ దాదాపు రూ.100 కోట్లు ఉంటుంది. బంగ్లాలోని విశాలమైన గదులను వైట్, గోధుమ షేడ్స్‌తో స్టైలిష్‌గా డిజైన్ చేశారు.   

5 /9

రంగురంగుల కుషన్‌లతో కూడిన ఖరీదైన సోఫాలను ఏర్పాటు చేశారు. మెయిర్ రూమ్ ఎత్తు దాదాపు 20 అడుగులు ఉంటుంది.  

6 /9

ఈ బంగ్లాలో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే.. రెండు వేర్వేరు లాబీలను కలుపుతూ ఒక గాజు వంతెనను ఏర్పాటు చేశారు.  

7 /9

ఈ గ్లాస్ బ్రిడ్జికి ఒకవైపు సచిన్ బెడ్ రూమ్ ఉండగా.. మరోవైపు సారా, అర్జున్ బెడ్ రూమ్స్‌ ఉన్నాయి. 

8 /9

ఈ బంగ్లాలో తాటి చెట్లు, పొదలు, పండ్ల చెట్లు, ఉష్ణమండల మొక్కలు,ఒక చిన్న చెరువుతోపాటు విశాలమైన తోట కూడా ఉంది.   

9 /9

తన భార్య అంజలి కోసం రుస్తోమ్‌జీ సీజన్స్‌లో బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC)లో రూ.7.5 కోట్లతో సచిన్ మరో అపార్ట్‌మెంట్ కొన్నారు. ఇది 1600 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్. ఇందులో లగ్జరీ సౌకర్యాలు ఉన్నాయి.