Add Zee Business As A Preferred Source
App

AP New Ration Cards: ఏపీలో కొత్త రేషన్ కార్డులు.. ఇలా అప్లై చేసుకోండి..

Written ByTA Kiran Kumar
Published: Dec 02, 2024, 09:39 AM IST|Updated: Dec 02, 2024, 09:39 AM IST

AP Ration Cards: ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా కొలువు దీరిన కూటమి ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంది. అంతేకాదు అందుకు తగ్గట్టు కసరత్తు చేస్తోంది. దీనిపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

AP New Ration Cards1/5

ఏపీ న్యూ రేషన్ కార్డ్స్

AP Ration Cards: ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామిలను ఒక్కొక్కటిగా అమలు చేసే ప్రయత్నంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తక్కువ ధరకే మద్యంతో పాటు.. త్వరలో మహిళలకు ఉచిత బస్పు సౌకర్యాన్ని కల్పించేందుకు రెడీ అవుతోంది.

Election Promice 2/5

ఎన్నికల్లో హామి

తాజాగా ఎన్నికల్లో ఇచ్చిన హామిల మేరకు కొత్త రేషన్ కార్డులు జారీ చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. సంక్రాంతి నుంచి కొత్త రేషన్‌కార్డులు ఇష్యూ చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది.

Ration Cards Name Changes 3/5

రేషన్ కార్డ్స్ నేమ్ ఛేంజెస్

ఈ క్రమంలోనే రేషన్‌ కార్డుల్లో పేరు మార్పులు, చేర్పులతో పాటు కొత్త కార్డులకు దరఖాస్తు చేసే ఛాన్స్  ప్రభుత్వం కల్పించింది. నేటి నుంచి ఈ అవకాశం అందుబాటులోకి రానుంది.

Grama Sachivalayam 4/5

గ్రామ సచివాలయాలు

ఈ నెల 28 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త రేషన్  దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హులైన వారికి సంక్రాంతి నుంచి కొత్త రేషన్‌కార్డులు జారీ చేయనుున్నారు. 

YCP Colors 5/5

YCP రంగులు

గత ప్రభుత్వ హయాంలో రేషన్‌కార్డులపై YCP రంగుల తో పాటు జగన్‌ మోహన్ రెడ్డి బొమ్మ ను ప్రింట్‌ చేశారు. ఇప్పుడు వాటి స్థానంలో కొత్త కార్డులు ఇవ్వనున్నారు. దీనికి బడ్జెట్‌ కూడా విడుదలైనట్లు తెలుస్తోంది.