Salman Khan Horoscope: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కి ఈ మధ్య బెదిరింపు కాల్స్ వస్తున్నాయి సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ జాతకం.. ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఆయన అభిమానులను.. షాక్ కి గురి చేస్తోంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్... కృష్ణ జింకను చంపి తిన్న నేపథ్యంలో కృష్ణ జింకను ఆరాధ్య దైవంగా భావించే బిష్ణోయ్ కమ్యూనిటీ వ్యక్తులు సల్మాన్ ఖాన్ ను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కమ్యూనిటీ వ్యక్తులు చాలాసార్లు ఆయనపై దాడికి దిగారు. ఆయన ఉన్న ఇంటిపై కాల్పులు కూడా జరిపారు. వీటన్నింటి నుండి తప్పించుకోవడానికి అత్యంత భద్రత మధ్య ఆయన జీవితాన్ని గడుపుతున్నారు.
ఇక ఇటీవల కాంగ్రెస్ పార్టీ నేత బాబా సిద్ధిఖీని ఇదే కమ్యూనిటీ వారు హత్య చేయడంతో సల్మాన్ ఖాన్ భయం గుప్పెట్లో.. ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే ఈయన గురించి ప్రేక్షకులే కాదు నిపుణులు కూడా మాట్లాడుకుంటున్నారు. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ జాతకం ఇదే అంటూ ఒకటి హల్చల్ చేస్తోంది . ఆయన పుట్టిన తేదీ, సమయం చూసి ఆయన జాతకం ఎలా ఉంటుంది అంటూ కొంతమంది పరీక్షిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆయన జాతకం ఒకటి బయటకు వచ్చింది. త్వరలోనే ఆయనకు ఒక ముప్పు తప్పదని జాతకంలో ఉన్నట్టు సమాచారం. సల్మాన్ ఖాన్ కు ప్రాణహాని ఉందని, ప్రస్తుత పరిస్థితులు చూస్తే మనకు తెలుస్తుంది.. అయితే ఆయన జాతకంలో కూడా ఇదే ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఇప్పట్లో ఆ ప్రాణహాని తప్పేలా లేదని, 2005 వరకు సల్మాన్ ఖాన్ జాగ్రత్తగా ఉండాలని లేకపోతే ప్రత్యర్థులే గెలుస్తారని జాతకంలో ఉన్నట్లు సమాచారం.
లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్ ఖాన్ కి ప్రాణహాని ఉన్న విషయం తెలిసిందే. ఇక అతడి నుంచి తప్పించుకోవడానికి పలుమార్లు హత్యాయత్నానికి కూడా ప్రయత్నించాడు. ఎలాగోలా అతడి నుంచి తప్పించుకుంటూ తనను తాను సేవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు సల్మాన్ ఖాన్.
ఇటీవలే లైసెన్స్డ్ రివాల్వర్ కూడా సొంతం చేసుకున్న ఈయన రూ .2కోట్లు విలువ చేసే బుల్లెట్ ప్రూఫ్ కార్ ను కూడా కొనుగోలు చేశారు. ఇలా 2025 వరకు తనను తాను కాపాడుకున్నట్లయితే ఆ తర్వాత జాతకంలో గ్రహాల పరిస్థితి మారి తనకంతా అనుకూలంగా మారుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.