Samantha-Sobhita: నాగచైతన్య - సమంత - శోభిత కాంబినేషన్లో మూవీ అనుకున్నారు అన్న విషయం మీకు తెలుసా..? అవును వీరు ముగ్గురు కలిసి ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే ఆ సినిమా మొదలు మాత్రం కాలేదు. ఇంతకీ ఆ సినిమా ఏది..? ఎందుకు మిస్సయింది అన్న విషయాన్ని ఒకసారి చూద్దాం..
నాగచైతన్య, సమంత ప్రేమించుకొని..పెద్దలను ఒప్పించి.. వివాహం చేసుకున్నారు. కానీ ఇద్దరి మధ్య విభేదాలు.. తలెత్తడంతో పెళ్లయిన నాలుగు సంవత్సరాలకే విడిపోయి.. ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇకపోతే సమంత ఒంటరిగా ఉంటూ కెరియర్ పై ఫోకస్ పెట్టింది కానీ.. నాగచైతన్య గత ఏడాది హీరోయిన్ శోభితని ప్రేమించి వివాహం చేసుకున్నారు. అప్పటినుంచి సమంత, శోభిత,నాగచైతన్య గురించి ఏవో ఒక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉన్నాయి.
అయితే తాజాగా ఇప్పుడు సమంత, శోభిత కాంబినేషన్లో ఒక సినిమా రావాల్సి ఉండగా, కొన్ని కారణాల చేత ఆగిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి పూర్తి వివరాల్లోకి వెళితే. సమంత, నాగచైతన్య కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం మజిలీ. అయితే ఈ సినిమాలో మొదట సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ కోసం శోభితని తీసుకున్నారట. ఈమెతో కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించినట్లు.. సమాచారం. అయితే కొన్ని అనుకోని కారణాలవల్ల మజిలీ సినిమా నుంచి శోభితని తప్పించారట.
ఆ తరువాత ఈమెకు బదులుగా మరొక హీరోయిన్.. దివ్యాంశ కౌశిక్ ని తీసుకోవడం జరిగిందట. నాగచైతన్య, సమంత వైవాహిక జీవితంలో కొనసాగుతున్న సమయంలోనే శోభిత అప్పుడప్పుడు అక్కినేని కుటుంబం ఇంటికి వెళుతూ ఉండేదట. అలాంటి సమయంలోనే నాగచైతన్యతో కూడా శోభితకి పరిచయం ఏర్పడిందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.
అలా వీరందరి మధ్య ఒకప్పుడు మంచి సన్నిహిత సంబంధం ఉండేదట. కానీ సమంతతో విడాకులు ఆ తర్వాత శోభితతో పెళ్లి ఇలా అన్నీ కూడా జరిగిపోయాయి. మొత్తానికి సమంత పాన్ ఇండియా లెవెల్లో హీరోయిన్గా సక్సెస్ అయ్యింది.
శోభిత కూడా బాలీవుడ్ లో బాగానే అవకాశాలు సంపాదించుకున్నా.. తెలుగులో పెద్దగా హీరోయిన్ గా రాణించలేకపోతోంది. సోషల్ మీడియాలో మాత్రం శోభితకు భారీ క్రేజ్ ఉన్నది. ఎప్పుడు గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.