Samantha: వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సమంత.. ఫోటోలు షేర్ చేసిన బ్యూటీ

Samantha Ruth Prabhu vacation Instagram pics: ఏం మాయ చేసావే సినిమాతో నిజంగానే మాయ చేసింది సమంత. తెలుగులో దాదాపు అందరూ స్టార్ హీరోలతోనూ నటించింది ఈ హీరోయిన్. ఈ మధ్యనే విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో కనిపించి మెప్పించింది. త్వరలోనే మా ఇంటి బంగారం సినిమాతో రానున్న ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు.. ప్రస్తుతం తెగ వైరల్ అవుతు అందరిని ఆకట్టుకుంటున్నాయి.

1 /5

గత కొద్దిరోజులుగా సమంత ఎక్కువగా సినిమాల్లో కనిపించలేదు. తన ఆరోగ్య కారణాల వల్ల.. కొద్ది సినిమాలో మాత్రమే ఒప్పుకుంటూ ఉంది ఈ హీరోయిన్. ఈ క్రమంలో ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమాతో బిజీగా ఉంది. 

2 /5

ఈ సినిమా నిర్మాణ బాధ్యతల్లో కూడా సమంత ఆక్టివ్ గా పాల్గొనడం విశేషం. ఇక మరో పక్క హిందీలో సిటడేల్ వెబ్ సిరీస్ తో మెప్పించనుంది. ప్రస్తుతం హిందీ నుంచి సమంతాకు ఎన్నో ఆఫర్లు వస్తున్నాయి అని వినికిడి. 

3 /5

త్వరలోనే షారుఖ్ ఖాన్ తో కూడా ఒక సినిమా చేయనుంది అని వార్తలు వస్తున్నాయి. అయితే వీటి పైన ప్రస్తుతం వరకు ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం లేదు. అయితే సమంతకి అన్ని భాషల కన్నా.. తెలుగులోనే ఎక్కువ పాపులారిటీ ఉన్న సంగతి తెలిసిందే. 

4 /5

అందుకే సమంత మా ఇంటి బంగారం సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. ఈ క్రమంలో సమంత ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతూ.. ఆమె అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. 

5 /5

ఈ ఫోటోలో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ కనిపించింది సమంత. ఎంతో ఆలస్యంగా అని క్యాప్షన్ పెట్టి.. తన వెకేషన్ ఫోటోలను షేర్ చేసి.. మరోసారి ఆమె అభిమానులను ఆమెతో ప్రేమలో పడేటట్టు చేసింది.