Samsung Galaxy A56 Price: సాంసంగ్‌ నుంచి శక్తివంతమైన మొబైల్‌.. ఫీచర్స్‌ చూస్తే పిచ్చికిపోతోంది!

Samsung Galaxy A56 Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ సాంసంగ్‌ మొబైల్స్‌ విక్రయాల పరంగా మార్కెట్‌లో దూసుకుపోతున్నాయి. ప్రీమియం ఫీచర్స్‌తో డెడ్‌చీప్‌ ధరలకే లభించడంతో చాలా మంది వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా ఈ మొబైల్స్‌ అతి శక్తివంతమైన కెమెరాలతో రావడం వల్ల యువత కూడా వీటినే కొనుగోలు చేసేందుకు మక్కవ చూపుతున్నారు. అయితే సాంసంగ్‌ కంపెనీ ఈ విక్రయాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైన ఫీచర్స్‌తో కొత్త కొత్త మొబైల్స్‌ విడుదల చేస్తున్నాయి.

1 /6

అధికారిక సమాచారం ప్రకారం, సాంసంగ్‌ కంపెనీ నుంచి మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ విడుదల కాబోతోంది. ఇది అతి శక్తివంతమైన కెమెరాతో పాటు ప్రత్యేకమైన ఫీచర్స్‌తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంతకీ ఈ స్మార్ట్‌ఫోన్‌ పేరేంటో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.  

2 /6

సాంసంగ్‌ తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ ఎ56 మొబైల్స్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన అధికారిక ప్రకటను ఇంకా కంపెనీ వెల్లడించలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.   

3 /6

సాంసంగ్‌ గెలాక్సీ ఎ56 (samsung galaxy a56 price) మొబైల్స్‌ను కంపెనీ రెండు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో విడుదల చేయబోతోంది. ఇందులోని బేస్‌ వేరియంట్‌ 8 GB ర్యామ్‌తో పాటు 128 GB స్టోరేజ్‌తో రెండవ వేరియంట్‌ 12 GB ర్యామ్‌, 256 GB స్టోరేజ్‌తో లాంచ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది.  

4 /6

ఇక ఈ samsung galaxy a56 price స్మార్ట్‌ఫోన్‌ ధర వివరాల్లోకి వెళితే.. దీని ధర రూ.39 వేల నుంచి ప్రారంభమయ్యే ఛాన్స్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. దీని డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఫుల్‌ HD+ రిజల్యూషన్‌తో డైనమిక్ AMOLED డిస్‌ప్లేతో వస్తోంది.  

5 /6

 ఇక సాంసంగ్‌ గెలాక్సీ ఎ56 స్మార్ట్‌ఫోన్‌ Exynos 1580 చిప్‌సెట్‌తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. దీని బ్యాక్‌ సెటప్‌లో 50-మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్ కెమెరాతో రాబోతోంది. అంతేకాకుండా ప్రత్యేకమైన 2-మెగాపిక్సెల్ సెకండరీ లెన్స్, 5-మెగాపిక్సెల్ సెన్సార్‌ కెమెరాలను కలిగి ఉంటుంది.  

6 /6

అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌లోని ఫ్రంట్‌ భాగంలో 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన 5000mAh బ్యాటరీతో విడుదల కాబోతోంది. దీంతో పాటు  45 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌, ఇలా అనేక రకాల ప్రీమియం ఫీచర్స్‌ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.