Samsung Galaxy S23 Diwali Sale Offer: దీపావళి సందర్భంగా ఫ్లిఫ్‌కార్ట్‌లో సాంసంగ్ గెలాక్సీ s23 (Samsung Galaxy S23 5G) స్మార్ట్ ఫోన్ పై అత్యధిక డిస్కౌంట్ లభిస్తోంది. దీనిని ఇప్పుడే కొనుగోలు చేసే వారికి అదనంగా రూ.2,000 వరకు బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా అనేక రకాల ఆఫర్స్ లభిస్తున్నాయి.
Samsung Galaxy S23 Diwali Sale Offer: దీపావళి సందర్భంగా ఇప్పటికే ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌తో పాటు ఫ్లిఫ్‌కార్ట్ (flipkart.com)లో ప్రత్యేకమైన సేల్స్ ప్రారంభమయ్యాయి. ఈ సేల్స్‌లో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రిక్ వస్తువులతో పాటు ఇతర వస్తువులపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని మల్టీ నేషనల్ బ్రాండ్లకు సంబంధించిన మొబైల్ డెడ్ చీప్ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా సాంసంగ్ బ్రాండ్లకు సంబంధించిన కొన్ని మొబైల్స్ ను కొనుగోలు చేసే వారికి 50%కు పైగా డిస్కౌంట్ తో పొందవచ్చు.
దీపావళి సందర్భంగా (Diwali Offer) ఫ్లిఫ్‌కార్ట్‌లో సాంసంగ్ మొబైల్స్ అత్యంత తగ్గింపు ధరతో అందుబాటులో ఉన్నాయి. ఇటీవల మార్కెట్లోకి విడుదలైన సాంసంగ్ గెలాక్సీ s23 ఆకర్షణీయమైన ఆఫర్స్‌తో లభిస్తోంది. అలాగే దీనిపై ఫ్లిప్కార్ట్ బ్యాంకుతోపాటు ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా అందిస్తోంది.
ప్రస్తుతం మార్కెట్లో ఈ సాంసంగ్ గెలాక్సీ s23 (Samsung Galaxy S23 5G) స్మార్ట్ ఫోన్ నాలుగు కలర్ ఆప్షన్స్‌తో పాటు రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులోని బేస్ వేరియంట్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ని కలిగి ఉంటుంది.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. కంపెనీ మార్కెట్లో దీనిని MRP ధర రూ.89,999లకు విక్రయిస్తోంది. అయితే దీవాలి సందర్భంగా ఫ్లిఫ్‌కార్ట్ దీనిపై ఏకంగా 55% వరకు డిస్కౌంట్ ను అందిస్తోంది. దీంతో ఈ ఆఫర్స్ అన్నీ పోను రూ.39,999కే పొందవచ్చు.
ఈ సాంసంగ్ గెలాక్సీ s23 (Samsung Galaxy S23 5G) స్మార్ట్ ఫోన్ పై దీపావళి సందర్భంగా ఫ్లిఫ్‌కార్ట్ మరికొన్ని ఆఫర్స్ కూడా అందిస్తోంది. ఇక ఇదే మొబైల్ ను బ్యాంక్ ఆఫర్స్ వినియోగించి కొనుగోలు చేస్తే మరింత తగ్గింపు కూడా లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్స్ లో భాగంగా ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి దీపావళి ఆఫర్స్ లో భాగంగా దీనిని కొనుగోలు చేస్తే ఏకంగా రూ.2,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
అలాగే ఈ స్మార్ట్ ఫోన్ ను ఫ్లిఫ్‌కార్ట్ (flipkart.com) అనుసంధాన యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా కూడా కొనుగోలు చేసే వారికి ఏకంగా రూ.2,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఇవే కాకుండా ఇతర బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి కూడా పేమెంట్ చేయవచ్చు. దీంతో అన్ని ఆఫర్స్ పోను రూ.37,999కే ఈ మొబైల్ పొందవచ్చు.
ఇక ఇవే కాకుండా ఫ్లిఫ్‌కార్ట్ (flipkart.com) ఈ స్మార్ట్ ఫోన్ పై అదనంగా కొన్ని ఈఎంఐ ఆఫర్స్ లభించడమే కాకుండా.. ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్స్‌ను వినియోగించి కొత్త ఫోన్‌ని పొందాలనుకునేవారు కొన్ని బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులతో పేమెంట్ చేయాల్సి ఉంటుంది.