Samsung Galaxy S22 Series: శాంసంగ్ గెలాక్సీ S22, S22 ultra మోడల్స్ లాంచ్, ధర, ఫీచర్లు ఇవే

స్మార్ట్‌ఫోన్ మార్కెట్ రారాజు శాంసంగ్ నుంచి మరో కొత్త ఫోన్ లాంచ్ అయింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 , ఎస్ 22 అల్ట్రా పేర్లతో రెండు మోడల్స్‌ను ప్రవేశపెట్టింది. ఈ రెండింటి ధరలు, ప్రత్యేకతలు, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy S22 Series: స్మార్ట్‌ఫోన్ మార్కెట్ రారాజు శాంసంగ్ నుంచి మరో కొత్త ఫోన్ లాంచ్ అయింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 , ఎస్ 22 అల్ట్రా పేర్లతో రెండు మోడల్స్‌ను ప్రవేశపెట్టింది. ఈ రెండింటి ధరలు, ప్రత్యేకతలు, ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
 

1 /5

ఇక ధరల విషయంలో..గెలాక్సీ ఎస్ 22 8 వందల డాలర్లు కాగా, గెలాక్సీ ఎస్ 22 ప్లస్ వేయి డాలర్లుగా ఉంది. గెలాక్సీ ఎస్ 22 అల్ట్రా మోడల్ 12 వందల డాలర్లుగా ఉంది. 

2 /5

శాంసంగ్  గెలాక్సీ ఎస్ 22, గెలాక్సీ ఎస్ 22 ప్లస్, గెలాక్సీ ఎస్ 22 అల్ట్రా మోడల్స్ కోసం ప్రీ బుకింగ్స్ ఇండియాలో ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 25న ఇండియన్ మార్కెట్‌లో రావచ్చు.

3 /5

గెలాక్సీ ఎస్ 22 అల్ట్రా 6.8 అంగుళాలతో డైనమిక్ ఎమోల్డ్ 2 ఎక్స్ డిస్‌ప్లే కలిగి ఉంది. 5వేల ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఆండ్రాయిడ్ 12 వెర్షన్‌తో వస్తోంది. ఇది కూడా  ఫాంటమ్ బ్లాక్, ఫాంటమ్ వైట్, గ్రీన్, పింక్, గోల్డ్, బర్గండీ రంగుల్లో అందుబాటులో ఉంది.  ఈ ఫోన్ 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ, 1 టీబీ స్టోరేజ్‌లతో వస్తోంది. ర్యామ్ కూడా 8 జీబీ, 12 జీబీల్లో ఉంటుంది.

4 /5

గెలాక్సీ ఎస్ 22 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి డైనమిక్ ఎమోల్డ్ 2ఎక్స్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఫాంటమ్ బ్లాక్, ఫాంటమ్ వైట్, గ్రీన్, పింక్, గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉంది. స్నాప్ డ్రాగన్ 8వ జనరేషన్‌తో 8 జీబీ ర్యామ్ కలిగి ఉంది. ఇందులో 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్‌లు ఉన్నాయి.

5 /5

గెలాక్సీ ఎస్ 22 అనేది 6.1 ఇంచెస్ డైనమిక్ ఎమోల్డ్ 2 ఎక్స్ డిస్‌ప్లేతో ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 వెర్షన్ దీని ప్రత్యేకత. స్నాప్ డ్రాగన్ 8వ జనరేషన్ 1 ఎస్ఓసీ, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో వస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫాంటమ్ బ్లాక్, ఫాంటమ్ వైట్, గ్రీన్, పింక్, గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉంది.