Samyuktha Menon: చీరకట్టలో మరింత సొగసుగా సంయుక్తా మీనన్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Samyuktha Menon: దక్షిణాది సహా మరే సినీ ఇండస్ట్రీకి సాధ్యం కానీ విధంగా ఎక్కువ మంది కథానాయికలను ఇచ్చిన స్టేట్ గా కేరళ ముందు వరుసలో ఉంటుంది. అలా మలయాళ ఇండస్ట్రీని నుంచి వచ్చి తెలుగులో సత్తా చూపెడుతున్న భామ సంయుక్తా మీనన్. ప్రస్తుతం తెలుగులో మీడియం రేంజ్ హీరోల పాలిట బెస్ట్ ఆప్షన్‌లా మారింది సంయుక్త మీనన్. అంతేకాదు త్వరలో బాలీవుడ్ లో అవకాశాలు పట్టేస్తోంది. 

1 /5

సంయుక్తా మీనన్.. 1995 సెప్టెంబర్ 11న కేరళలోని పాలక్కడ్‌లో జన్మించింది. అంతేకాదు ఎకనామిక్స్ డిగ్రీ పూర్తి చేసి సినిమాల్లో ప్రవేశించింది.

2 /5

సంయుక్త మలయాళంలో యాక్ట్ చేస్తూనే.. తమిళంలో 'కలరి' మూవీతో పలకరించింది. అటు  తన మాతృభాష మలయాళంలో 'లిల్లీ' మూవీలో టైటిల్ రోల్ ప్లే చేసింది. ప్రస్తుతం నిఖిల్ సరసన 'స్వయంభూ' మూవీలో నటిస్తోంది.

3 /5

సంయుక్తా మీనన్  2016లో మలయాళ మూవీ 'పాప్ కార్న్‌' మూవీతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. 

4 /5

సంయుక్తా మీనన్.. పేరుకు కేరళ కుట్టీ  అయిన.. తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. తెలుగులో ఈమె మొదటి సినిమా 'బింబిసార'.. కానీ విడుదలైన మొదటి చిత్రం పవన్ కళ్యాణ్, రానాల 'భీమ్లా నాయక్'..

5 /5

ప్రస్తుతం సంయుక్త మీనన్.. తెలుగులో వరుస హిట్స్‌తో దూకుడు మీదుంది ఈ భామ. బింబిసార, భీమ్లా నాయక్, సార్ సినిమాలతో విరూపాక్ష సినిమాలతో వరుస హిట్స్ అందుకుంది.