Dec 5 School Holiday: ఆంధ్రప్రదేశ్లో మరొకసారి ఎన్నికల హడావిడి మొదలవుతోంది.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అంటే అందరూ కూడా చాలా ఎక్సైటింగ్ గానే ఎదురు చూస్తుంటారు.. తాజాగా ఉమ్మడి పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాలలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు సైతం డిసెంబర్ 5వ తేదీన జరగబోతున్నాయి. అందుకే ఆరోజున సెలవు దినంగా ప్రకటించారు.
ఎన్నికల డిసెంబర్ 12వ తేదీలోపు నిర్వహణ పూర్తి చేయాలంటూ ఈసీ అధికారులు తెలియజేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతున్నట్లు ఈసీ అధికారులు తెలియజేశారు.
ఇక ఓట్ల లెక్కింపు విషయానికి వస్తే డిసెంబర్ 9వ తేదీన జరుగుతుందని తెలియజేశారు..ఈ సందర్భంగా ఆయా జిల్లాలలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న వేళ రేపటి రోజున సెలవు ఇవ్వాలని సిఎస్ నిరభ్ కుమార్ కూడా జిల్లాల కలెక్టర్లకు సైతం ఆదేశాలను జారీ చేశారు. అవసరమైతే పోలింగ్ కి ముందు రోజు కూడా సెలవు ఇచ్చేలా చూడాలంటూ సలహా ఇచ్చారట.
ముఖ్యంగా 9వ తేదీన ఓట్లు లెక్కింపు చేయడం జరుగుతుంది కాబట్టి, అప్పుడు కేంద్రాలుగా వాటిని ఉపయోగించుకుని కార్యక్రమాలకు కూడా సెలవు ప్రకటించడం పైన త్వరలోనే ఒక సరైన నిర్ణయాన్ని తీసుకుంటామంటూ తెలియజేశారు సిఎస్ నీరభ్ కుమార్.
2025 మార్చి 29న ఉమ్మడి కృష్ణ, గుంటూరు తో పాటుగా పశ్చిమ గోదావరి తూర్పు జిల్లాలలో ఎమ్మెల్సీల పదవీకాలం ముగుస్తుంది. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికలను సైతం నిర్వహించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను సైతం వైసీపీ పార్టీ అనూహ్యంగా బహిష్కరించినట్లు ఇటీవల ప్రకటించింది.
మరి ఏ మేరకు ఈ ఎన్నికలలో విజయాన్ని ఎవరు అందుకుంటారో చూడాలి మరి. మరి కూటమిలో భాగంగా ఎవరు విజయాన్ని అందుకుంటారో చూడాలి మరి. ఏది ఏమైనా ఎన్నికలకు మరింత కట్టు దిట్టమైన చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం.