Lasya Nanditha: ఎమ్మెల్యే లాస్య నందిత అరుదైన ఫొటోలు.. భావోద్వేగానికి లోనైన కేసీఆర్

Lasya Nanditha: రోడ్డు ప్రమాదంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో తెలుగు రాష్ట్రాలు దిగ్భ్రాంతికి లోనయ్యాయి. ఇక బీఆర్‌ఎస్‌ పార్టీకి ఆమె మరణం తీరని లోటుగా మిగిలింది. ఆమె మృతికి గులాబీ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్ రావు, ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు. నందిత పార్థీవదేహానకి కేసీఆర్‌ పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు జరిగాయి.

1 /9

Lasya Nanditha: ఎమ్మెల్యే లాస్య నందిత పార్థివదేహానికి నివాళులర్పించి భావోద్వేగానికి లోనైన బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌

2 /9

Lasya Nanditha: స్నేహశీలిగా ఉంటూ ఇప్పుడిప్పుడే అందరి ప్రశంసలు పొందుతున్న లాస్య నందిత హఠాన్మరణం తెలంగాణను దిగ్భ్రాంతికి గురి చేసింది.

3 /9

Lasya Nanditha: లాస్య నందితకు రాజకీయంగా అండదండగా నిలిచిన బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌

4 /9

Lasya Nanditha: తండ్రి సాయన్న వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన లాస్య నందిత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపు.

5 /9

Lasya Nanditha: బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో లాస్య నందిత ప్రత్యేక అనుబంధం. ఈ క్రమంలోనే కంటోన్మెంట్‌ టికెట్‌ లాస్య నందితకు ఇచ్చిన కేసీఆర్‌.

6 /9

Lasya Nanditha: తండ్రి సాయన్న మాదిరి లాస్య నందిత ఎమ్మెల్యే పదవిలోనే మరణించారు. తండ్రి రాజకీయ వారసురాలిగా ఎదుగుతున్న లాస్య నందిత.

7 /9

Lasya Nanditha: రెండు నెలల నుంచి ఆమెను వెంటాడుతున్న మృత్యువు.  తరచూ ఏదో ప్రమాదం బారినపడుతున్న లాస్య నందిత చివరకు రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది.

8 /9

Lasya Nanditha: నిత్యం ప్రజలతో మమేకమవుతూ కంటోన్మెంట్‌ ప్రజలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే లాస్య నందిత.

9 /9

Lasya Nanditha: ఎంతో రాజకీయ భవిష్యత్‌ ఉన్న లాస్య నందిత మృతితో కంటోన్మెంట్‌లో తీవ్ర విషాదం అలుముకుంది.