Bank Holidays in September 2023: వచ్చే నెలలో 16 రోజులు బ్యాంకులు బంద్.. సెలవుల జాబితా ఇదిగో..!

September Bank Holidays: సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు రానున్నాయి. బ్రాంచ్‌కు వెళ్లి పూర్తి చేసుకోవాల్సిన పనులు ఉంటే సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసుకోండి. సెప్టెంబర్ నెలకు సంబంధించి బ్యాంకుల సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం వచ్చే నెలలో మొత్తం 16 రోజుల పాటు బ్యాంకులు బంద్ కానున్నాయి. 
 

  • Aug 23, 2023, 16:52 PM IST
1 /4

బ్యాంకు వినియోగదారులు సెలవుల తేదీని బట్టి ముందుగా ప్లాన్ చేసుకోవాలి. బ్యాంకులకు సెలవులు ఉన్నా.. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం ద్వారా పనులు చేసుకోవచ్చు.   

2 /4

సెప్టెంబరు 6, 7వ తేదీల్లో శ్రీ కృష్ణ జన్మాష్టమి,  28న ఈద్-ఇ-మిలాద్ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు క్లోజ్ కానున్నాయి.    

3 /4

సెప్టెంబర్ 3న ఆదివారం, సెప్టెంబర్ 9న రెండవ శనివారం, సెప్టెంబర్ 10న ఆదివారం, సెప్టెంబర్ 17 ఆదివారం, సెప్టెంబర్ 23న నాల్గో శనివారం, 24న ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు ఉంటాయి.  

4 /4

సెప్టెంబర్ 18  వర్సిద్ధి వినాయక వ్రతం, సెప్టెంబర్ 19న గణేష్ చతుర్థి, సెప్టెంబర్ 20 నుఖాయ్ (ఒడిశా), సెప్టెంబర్ 22 శ్రీ నారాయణ గురు సమాధి దివస్, 25న శ్రీమంత్ శంకర్‌దేవ్ పుట్టిన రోజు, సెప్టెంబర్ 27న మిలాద్-ఎ-షెరీఫ్, సెప్టెంబర్ 28న ఈద్-ఎ-మిలాద్ లేదా ఈద్-ఇ-మిలాదున్నబి, 29న ఇంద్రజాత్ర, శుక్రవారం ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీ (జమ్ము మరియు శ్రీనగర్) ప్రకారం ఆయా రాష్ట్రాల్లో సెలవులు ఉండనున్నాయి.