Remedies For Shani: ఏలి నాటి శని దోషాలు ఈ చిట్కాలు పాటిస్తే దరిద్రం పటాపంచులు !!

Remedies For Effects Of Shani: నవగ్రహాల్లో శని గ్రహం ఎంతో ప్రత్యేకమైనది. ఈ గ్రహం న్యాయం, కర్మ ఫలాలకు అధిపతిగా పరిగణించబడుతుంది. జాతక చక్రంలో శని గ్రహం శుభస్థానంలో ఉన్నప్పుడు రాజయోగాన్ని ప్రసాధిస్తాడు. కానీ శని గ్రహం నీచస్థానంలో ఉన్నప్పుడు మాత్రం అనారోగ్య సమస్యలు, ఆర్థిక నష్టం వంటి కష్టాలు కలుగుతాయి. ఈ సమస్యల నుంచి బయటపడడానికి చాలా మంది పండితులు దోష నివారణ చేయాల్సి ఉంటుందని చెబుతుంటారు. కొంతమంది దానాలు, పూజలు, శాంతి పూజలు చేస్తుంటారు. కానీ ఎలాంటి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే శని గ్రహ దోషాలను తొలగించుకోవచ్చు. 

1 /8

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దోషం అనేది వ్యక్తి జాతకాన్ని పరిశీలించి చెబుతుంటారు. శని గ్రహం రాశిపై ప్రభావం  చూపించినప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. దీని శని దోషంగా భావిస్తారు పండితులు. 

2 /8

శని దోషం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఇబ్బందులు, గొడవలు, కుటుంబ సభ్యులతో కలతలు ఏర్పుడుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతాయి. ఏ పని చేసిన ఆలస్యం అవుతుంది. అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.   

3 /8

శని దోషాలను తొలగించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంట్లో ఉండే కిచెన్‌లో కొన్ని పదార్థాలను ఉపయోగించి తొలగించుకోవచ్చు. 

4 /8

మీరు ఎటు వంటి ఖర్చు లేకుండా ఏలాంటి దానాలు చేయకుండా ఈ పదార్థాలతో శని దోషాన్ని తొలగించుకోవచ్చు. 

5 /8

వంట గదిలో ఎల్లప్పుడు ఉండే నల్ల మిరియాలను తీసుకొని తల చుట్టూ 7 సార్లు తిపి నాలుగు దిక్కులు కలిసే రోడ్డులో విసిరేయాలి. వెనక్కి తిరగకుండా ఇంటికి వచ్చి కళ్ళు, చేతులు కడుకోవాలి. ఇలా చేయడం వల్ల శని దోషాలు తొలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. 

6 /8

అనుకున్న పనులు త్వరగా ముందు కొనసాగాలంటే గుమ్మం మీద కొన్ని నల్ల మిరియాలు పెట్టుకొని వాటిని తొక్కాలి. ఆ తరువాత ఇంటి నుంచి కుడి కాళ్ళు పెట్టి బయటకు వెళ్ళితే పనులు పూర్తి అవుతాయి. 

7 /8

 తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు, నరదృష్టితో బాధపడుతున్నవారు ఇంటిలో ఉండే ఏ మూలలో అయితే దీపాని పెట్టి అందులోకి ఎనిమిది నల్ల మిరియాలు వేయాలి. ఇలా చేయడం వల్ల ఇతరలు నుంచి డబ్బులు తిరిగి వస్తాయి, నరదృష్టి తగ్గుతుంది.

8 /8

గమనిక: ఇక్కడ తెలిపిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే.