Shani Transit: ఈ రాశుల వారిపై శని దేవుడి అశుభ దృష్టి తొలిగింపు.. పెళ్లి కానీ ప్రసాద్ లకు వివాహా యోగమే..!

Shani Transit: శనీశ్వరుడు నవగ్రహాల్లో ఆయనంటే మాన్యల నుంచి సామాన్యల వరకు అందరికీ హడల్.  ఆయన  అపార కరుణ కటాక్షాలు ఉంటే చాలు ఎలాంటి కష్ట కార్యములైనా.. సులభంగా నెరవేరే అవకాశాలు ఉంటాయి.అందుకే నవగ్రహాల్లో శని దేవుడికి ఉన్న ప్రాధాన్యత ఏ గ్రహానికి లేదు.   ప్రస్తుతం శని దేవుడు కుంభ రాశిలో అపసవ్య దిశలో సంచరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ రాశుల వారికీ వివాహా ప్రయత్నాలతో పాటు ఉద్యోగంలో విజయాలు వరించే అవకాశాలున్నాయి.

 

1 /7

Astrology - Shani Transit: జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొకి రాశిలోకి సంచరిస్తూ ఉంటాయి. ఈ తొమ్మిది గ్రహాల్లో  శనీదేవుడిని మాత్రమే శనీశ్వరుడుని సంబోధిస్తూ ఉంటారు. ఈయన ఒక రాశి నుంచి మరొక రాశిలో  మారడానికి ఎక్కువ సమయం తీసుకుంటాడు. దానికి దాదాపు రెండున్నరేళ్లు పడుతుంది. మెల్లగా ప్రయాణిస్తాడు గనుక ఈయనకు మందుడని పేరు వచ్చింది.

2 /7

ముఖ్యంగా నవగ్రహాల్లో శని దేవుడు ప్రస్తుతం సంచరించే రాశితో పాటు దానికి ముందు వెనకాల రాశి వారికి కలిపి ఏల్నాటి శని స్థితి ఏర్పడుతుంది. ఇది ఏడున్నరేళ్ల ఉంటుంది. ఏల్నాటి శని ప్రభావం వల్ల లైఫ్ లో లేనిపోని ఆటంకాలు.. సమయానికి పనులు జరగకపోవడం వంటివి జరగుతూ ఉంటాయి. శని దేవుడి స్థాన చలనం వల్ల శుభా శుభా ఫలితాలుంటాయి.

3 /7

శనిదేవుడు ప్రస్తుతం కుంభ రాశిలో వక్రంలో సంచరిస్తున్నాడు. అంతేకాదు శనీశ్వరుడు అక్టోబరు 3న శతభిషా నక్షత్రంలో నాలుగో స్థానంలోకి ప్రవేశించబోతున్నాడు. పూర్వ భాద్ర  నక్షత్రానికి అధిపతి గురువు మరియు శతభిషా నక్షత్రానికి అధిపతి రాహువు. అటువంటి పరిస్థితిలో బృహస్పతి  శని సంచారము వలన ఎవరెవరికి అనుకూలంగా ఉండబోతుందో మీరు ఓ లుక్కేయండి..

4 /7

కన్యా రాశి: కన్యా రాశి వారికి శనీశ్వరుడి నక్షత్ర మార్పు వల్ల అత్యంత అనుకూలంగా ఉండబోతుంది. మీరు న్యాయపరమైన విషయాల్లో  సక్సెస్ అందుకుంటారు.  గత కొన్నేళ్లుగా మ్యారేజ్ ప్రయత్నాలు చేస్తున్నవారికీ ఈ  యేడాది పెళ్లి యోగం ఉండే అవకాశం ఉంది. వ్యాపారస్థులకు ఇది అత్యంత అనుకూలగా ఉండబోతుంది. అంతేకాదు ఈ రాశుల వారికీ పూర్వీకుల ఆస్తి కలిసొస్తోంది. ఉద్యోగ రీత్యా పలు మార్పులు చేర్పులు ఉంటాయి. అదే సమయంలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి.    

5 /7

వృశ్చికం: కుంభ రాశిలో శని సంచారం వల్ల వృశ్చిక రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన మీ పనులు పూర్తవుతాయి.   వివాహాం కానీ స్త్రీ, పురుషులకు ఈ ఇయర్  తప్పక వివాహాం  జరుగుతుంది. ఆస్తులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా  తల్లి హెల్త్ కు సంబంధించిన కొన్ని ఇష్యూస్ బాధించినా..  చివరకు  శుభవార్తలను అందుకుంటారు. ఈ సయమంలో వ్యాపారస్థులకు ఇది అత్యంత అనుకూలమైనదని చెప్పాలి.  

6 /7

కుంభ రాశి: కుంభ రాశి వారికి  శని దేవుడి సంచారం వల్ల అనేక శుభయోగాలు కలగనున్నాయి. ఈ రాశి వారికీ  ఫ్యామిలీ తో పాటు పూర్వీకుల నుండి ఆస్తులు కలిసొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోన్న పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. శనీశ్వరుని అనుగ్రహంతో సమాజంలో మీ స్థానం, కీర్తి ప్రతిష్టలు ఓ రేంజ్ లో  పెరుగుతాయి. అంతేకాదు ఆర్ధికంగా మీ పరిస్థితి ఉన్నతగా ఉంటుంది. 

7 /7

పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీనితో Zee Mediaకి ఎలాంటి సంబందం లేదు.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x