Shani Dev Worship: శనిదోషంతో ఇబ్బందులు పడుతున్న వారికి బంపర్ ఆఫర్.. ఇలా చేస్తే మీ జీవితంలో ఊహించని రాజయోగం..

Shani Dev: శనిత్రయోదశి తిథి శనివారం రోజురావడంను ఎంతో గొప్పదని జ్యోతిష్యులు చెబుతుంటారు. అందుకే ఏలినాటి, అర్దష్టమ, శనిప్రభావంతో బాధపడుతున్న వారు ఈ పరిహరాలు పాటించాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.
 

1 /6

ప్రతిఒక్కరు కూడా తమ  జీవిత కాలంలో ఏలినాటి శని, అర్ధష్టమ శని, సాడేసాతి దోషాలతో బాధపడుతుంటారు.ఈ సమయంలో శనిదేవుడు జీవితంలో భరించలేని కష్టాలను పెడుతుంటాడు. ముఖ్యంగా శని దేవుడికి కర్మలకు అధిపతి అంటారు. అంటే ఆయన మనం చేసే పనులను బట్టి మనకుఫలితాలను ఇస్తుంటాడు.

2 /6

మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు, కావాలని చెడు కర్మలు చేస్తే ఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయి. ముఖ్యంగా శనివారం, అది కూడా త్రయోదశి రావడం ఎంతో మహత్తుగా పరిగణిస్తారు . ఈరోజున శనిదేవుడికి మన శక్తికొలది పూజించుకోవాలని చెబుతుంటారు.  

3 /6

శనిదేవుడికి ముఖ్యంగా తైలంతో అభిషేకం చేయిస్తే ఆయన సంతోష పడుతారంట. అదే విధంగా.. శనివారం రోజు పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయాలి,ఈరోజున రావిచెట్టు నీడలో నల్లని చీమలకు చక్కెర వేయాలని జ్యోతిష్యులు చెబుతుంటారు.అదే విధంగా ఆంజనేయ స్వామికి  సిందూర పూజలు చేస్తే మంచిదంట.

4 /6

ముఖ్యంగా శనివారం, త్రయోదశి రోజున సాయంకాలం ప్రదోష సమయంలో శివుడికి అభిషేకం చేస్తే మంచి ఫలితాలు కల్గుతాయంట. అదే విధంగా.. ఈరోజు ఆంజనేయస్వామివారి తమలపాకులతో ప్రత్యేకంగా అలంకరిస్తేకూడా జీవితంలో గొప్పమార్పుల సంభవిస్తాయంట. 

5 /6

ఏలినాటి ప్రభావం ఉన్న జాతకులు.. నవగ్రహాలకు సంబంధించిన స్తోత్రాలు చదువుకోవడం,దానాలు ఇవ్వడం చేస్తే మంచి ఫలితాలు కల్గుతాయి. ఇంట్లో ఈరోజు తప్పనిసరిగా పులిహోర చేసిస్వామి వారికి నివేదన చేయాలని చెబుతుంటారు.  

6 /6

ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తోంది. మధ్యాహ్నం పూట ఆకలితో ఉన్న ఒకరిద్దరు పేదవాళ్లకు తమచేతనైనంతా అన్నం లేదా మంచి నీళ్లు అందిస్తే శనిదేవుడు మనమీద ఉన్న చెడు ప్రభావం తప్పిస్తాడని జ్యోతిష్యులు చెబుతుంటారు. Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)