Shilpa Shetty: శిల్పా శెట్టి ఈ పేరు ఒకప్పటి యూత్ కు ఆరాధ్య దేవత. ఈ సాగరకన్య గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. పేరుకు తగ్గట్టు శిల్పి ఉలిని పట్టుకొని అందమైన శిల్పం చెక్కినట్టుగా ఉంటుంది శిల్పా శెట్టి అందాల సోయగం. ఏజ్ 50 దాటినా.. ఇప్పటికీ అదే చెక్కు చెదరని అందంతో కుర్రాళ్లను కుళ్లు కొనేలా చేస్తోంది.
శిల్పాశెట్టి మధ్యలో మూవీలకు దూరమైనా.. తన యోగాసనాలతో ఫ్యాన్స్ కు ఎపుడు దూరం కాలేదు. ఏజ్ 50 యేళ్లకు దగ్గర పడ్డ ఇప్పటికీ అదే శరీర సౌష్ఠవంతో అలరిస్తూనే ఆశ్చర్యానికి గురి చేస్తోంది ఈ మంగళూరు భామ.
శిల్పాశెట్టి ప్రతి రోజు యోగాసనాలతో షురూ అవుతోంది. యోగాసనాలతో పాటు వేపుళ్లు, చిరు తిండ్లకు దూరంగా ఉండటమే శిల్పా శెట్టి అందాల సీక్రెట్. అంతేకాదు ప్రతి రోజు తన ఆహారంలో నీరు ఎక్కువగా ఉండేలా చూసుకుంటుంది. అంతేకాదు కొబ్బరి నీళ్లు, ఆకు కూరలు, నాని బెట్టిన పెసళ్లు, చిక్కడు గింజలను ఎక్కువగా తీసుకుంటుందట. అంతేకాదు రోజులో ఓ సారి గ్రీన్ టీ తీసుకుంటుందట. అవసరం మేరకు అన్నం, పప్పు, కూరలు ఆహారంలో భాగంగా తీసుకుంటోంది.
శిల్పాశెట్టి విషయానికొస్తే.. రీసెంట్ గా ఈ భామ రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇండియన్ పోలీస్ ఫోర్స్'లో తార శెట్టి అనే పోలీస్ ఆఫీసర్‌లో పాత్రలో మెప్పించింది ఈ భామ.
శిల్పాశెట్టి సినిమాల విషయానికొస్తే.. హిందీలో షారుఖ్ హీరోగా నటించిన 'బాజీఘర్'మూవీతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. పేరుకు హిందీ భామ అయినా.. తెలుగు సినిమాలతో శిల్పా శెట్టికి మంచి అనుబంధమే ఉంది.
శిల్పాశెట్టి.. టాలీవుడ్‌లో వెంకటేష్ హీరోగా దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు డైరెక్షన్ లో'సాహసవీరుడు సాగరకన్య' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో మోహన్ బాబుతో వీడెవండీ బాబు, నాగార్జునతో ఆజాద్, బాలకృష్ణతో భలేవాడివిబాసూ సినిమాల్లో నటించింది.
దాదాపు 7 యేళ్ల తర్వాత నికమ్మతో పాటు, హంగామా చిత్రాలతో పలకరించింది. రీసెంట్ గా రోహిత్ శెట్టి 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' వెబ్ సిరీస్ లో తారా శెట్టి పాత్రలో మంచి నటనే కనబరించింది.