Shriya Saran: జోరు మీదున్న శ్రియ.. ఇంస్టాగ్రామ్ లో వరస ఫోటోలతో విందు

Shriya Saran Hot Photos: రెండు దశాబ్దాలకు పైగా తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ శ్రియ. సినిమాలతోనే కాకుండా తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా కూడా ప్రస్తుతం తన అభిమానులను తెగ మెప్పిస్తోంది.

  • Mar 17, 2024, 15:08 PM IST
1 /5

రామోజీరావు నిర్మాణంలో వచ్చిన ఇష్టం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శ్రియ. మొదటి సినిమా పెద్దగా హిట్ కాకపోయినా రెండో సినిమాకే నాగార్జున లాంటి స్టార్ హీరోతో ఛాన్స్ కొట్టేసింది ఈ భామ.

2 /5

సంతోషం సినిమా సూపర్ సక్సెస్ సాధించటంతో శ్రియ కెరియర్ కి హద్దు లేకుండా పోయింది. వరస ఆఫర్లు అందుకుంటూ ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.

3 /5

చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలతో అలానే జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో నటించిన శ్రియ రాజా, తరుణ్, ఉదయ్ కిరణ్ లాంటి రైసింగ్ హీరోలతో కూడా అప్పట్లో నటించి మెప్పించింది.

4 /5

తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషలలో కూడా పలు సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

5 /5

తాజాగా శ్రియ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తున్న వరస ఫోటోలు ప్రస్తుతం ఆమె అభిమానులను తెగ అలరిస్తున్నాయి. రకరకాల స్టైల్స్ లో డ్రెస్సుల్లో కనిపించి.. అందరినీ మెప్పిస్తోంది ఈ హీరోయిన్.