Beetroot Puree Recipe: చాలామంది అన్ని రకాల పూరీలను చూసి ఉంటారు. ఎప్పుడైనా మీరు బీట్రూట్ పూరీని చూశారా? ఈ రెసిపీ ని ఎలా తయారు చేసుకోవాలోని చాలామందికి తెలియదు. అయితే ఇలాంటి వారి కోసం సులభమైన పద్ధతిలో తయారీ విధానాన్ని పరిచయం చేయబోతున్నాం. అదెలాగో ఇప్పుడు తెలుసుకోండి.
Beetroot Puree Recipe: ప్రస్తుతం చాలామంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకునే ఆహారాలపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతున్నారు. చాలామంది అనారోగ్యకరమైన ఆహారాలను తినేందుకు ఎక్కువగా ఇష్టపడడం లేదు. అంతేకాకుండా కొంతమంది అయితే ఇంటర్నెట్లో ఆరోగ్యకరమైన ఆహారాల గురించి సెర్చ్ కూడా చేస్తున్నారు. మనం తీసుకునే రోజువారి ఆహారాలే కొన్ని రకాల కూరగాయలను వేసి ఇంకా హెల్తీగా తయారు చేసుకోవచ్చు. చాలామంది ఉదయం పూట ఎక్కువగా అల్పాహారంలో భాగంగా ఇడ్లీలు పూరీలు తింటూ ఉంటారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో యువత ఎక్కువగా పూరీలు తినేందుకు ఇష్టపడతారు. బయట హోటల్స్ లో తయారు చేసే పూరీలను ఎక్కువగా తినడం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటిని బయట తినేదానికి బదులుగా ఇంట్లోనే హెల్తీగా తయారు చేసుకుని తింటే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. చాలామందికి బీట్రూట్ గురించి తెలిసి ఉంటుంది అయితే పూరీలు తయారు చేసుకునే క్రమంలో బీట్రూట్ నుంచి తీసిన ప్యూరీని పూరీల పిండితో కలిపి వాటిని తయారు చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ సులభమైన పద్ధతి మీకోసమే, ఇప్పుడే ట్రై చేయండి..
బీట్రూట్ పూరి తయారీకి కావలసిన పదార్థాలు: 2 కప్పుల గోధుమ పిండి, 1/2 కప్పు తురిమిన బీట్రూట్, 1/2 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,
1/2 టీస్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీస్పూన్ కారం పొడి, 1/4 టీస్పూన్ ఉప్పు, నూనె వేయడానికి
తయారీ విధానం: ఈ బీట్రూట్ పూరీలు తయారు చేసుకోవడానికి ముందుగా పిండి కలపడానికి సరిపోయే బౌల్ ని తీసుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని, అందులో తురిమిన బీట్రూట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, కారం పొడి, ఉప్పు వేసి బాగా మిక్సీ కొట్టుకోవాల్సి ఉంటుంది .
ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని బౌల్లో వేసుకొని అందులో గోధుమపిండిని కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఈ పిండిలో కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ, మెత్తని పిండిని కూర్చాలి.
పిండి చాలా గట్టిగా లేదా చాలా పలచగా ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇలా బాగా కలుపుకున్న పిండి మిశ్రమాన్ని 15 నిమిషాలు పాటు బౌల్ పై మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి.
ఆ తర్వాత పిండిని చిన్న చిన్న ముద్దలా చేసుకుని మరో 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
ఈ తయారు చేసుకున్న ముద్దలను పూరి లాగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఒక బాణలిలో నూనె వేడి చేసి, పూరీలను బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి.
వేడి వేడిగా మీకు ఇష్టమైన కూర లేదా పప్పుతో కలిపి తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి మీ సొంతం.