Singer Sunitha comments: సింగర్ సునీత తొలిసారి వైజాగ్ వేదికగా మ్యూజిక్ కాన్సెర్ట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తొంది. ఈ కార్యక్రమం విశాఖ ఎంజీఎం గ్రౌండ్స్ లో జరగనుందని తెలుస్తొంది. అయితే.. సునీత వైజాగ్ తో తనకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడినట్లు తెలుస్తొంది.
సింగర్ సునీత ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుందని చెప్పుకొవచ్చు. కొన్నిసార్లు కాంట్రవర్షీ అంశాలతో సింగర్ సునీత వార్తలలలో నిలుస్తుంటే మరికొన్ని సార్లు తన సింగింగ్ కు సంబంధించిన మ్యూజిక్ కాన్సెర్ట్ ల గురించి అప్ డేట్ ఇస్తు ట్రెండింగ్ లో ఉంటున్నారు.
ఇటీవల సింగర్ సునీత రెండో పెళ్లి గురించి, భర్తతో గొడవలు అయ్యాయని, ఆమె ప్రెగ్నెంట్ అని కూడా రకరకాల రూమర్స్ వైరల్ అయ్యాయి. దీనిపై సింగర్ సునీత కూడా స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తొంది.
అయితే.. తాజాగా సింగర్ సునీత డిసెంబర్ 6 వ తేదీన వైజాగ్ లోని ఎంజీఆర్ గ్రౌండ్స్ లో ఫస్ట్ మ్యూజీకల్ కాన్సెర్ట్ ను చేస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను సైతం విడుదల చేశారు. ఈ క్రమంలో వైజాగ్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి.
సింగర్ సునీత అమ్మమ్మవాళ్ల ఊరు వైజాగ్ అంట. చిన్నప్పుడు స్కూల్ డేస్ లో హలీడేస్ రాగానే.. విశాఖ పట్నంలో వాలిపోయే వారంట. అక్కడ పచ్చని చెట్లు, కొండలు, జలపాతాలంటే సునీతకు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టమంట.
సునీత తల్లి కూడా కైలాసగిరి కొండలు, రుషీ కొండలు, వైజాగ్ లోని అనేక ప్రదేశాలలో చిన్నప్పుడు తీసుకెళ్లేదంట. దీంతో ఆ పచ్చని వాతావరణం, కొండలు, ఆహ్లాదరకమైన వెదర్ అంటే సునీతకు ఎంతో ఇష్టమంట. ఒక్కమాటలో చెప్పాలంటే.. అమ్మమ్మ గ్రామమైన వైజాగ్ అంటే తనకు ఎంతో ప్రేమ అని కూడా సునీతా చెప్పుకొచ్చారంట.
విమానంలో వైజాగ్ వచ్చేటప్పుడు.. అక్కడి పచ్చని చెట్లు, కొండలను చూస్తు అలా కూర్చుని పొయేదాన్ని అని సింగర్ సునీత వైజాగ్ పట్ల తనకున్న ప్రేమను గురించి చెప్పుకున్నారు. తను రియల్ గా..ఒక నేచర్ లవర్ అని.. తన ఫస్ట్ క్రష్ వైజాగ్ అని కూడా సునీత చెప్పుకొచ్చారంట.
తను ఎంత బిజీగా ఉన్న .. ఏ మాత్రం గ్యాప్ దొరికిన వైజాగ్ వచ్చి వాలిపోతానని, ఇక్కడ తమ బంధువులు ఉన్నారని కూడా సునీతా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో సింగర్ సునీత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.