Side Effects Of Soap On Face: ముఖానికి సబ్బు రాసుకునే వాళ్లకు ఇది తెలిస్తే.. మళ్లీ ఆ పనిచేయరు

Side Effects Of Soap On Face: స్కిన్ కేర్ విషయంలో సబ్బు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే అదే సమయంలో సబ్బును నేరుగా ముఖంపై అప్లై చేయడం వల్ల చర్మంపై నెగటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయంటున్నారు స్కిన్ కేర్ ఎక్స్‌పర్ట్స్. ఫేస్ వాష్‌తో ముఖాన్ని కడుక్కుంటే ఇబ్బంది లేదు కానీ సబ్బుతో ముఖం కడుక్కునే వారికే అసలు సమస్యట. ముఖంపై సబ్బుతో రుద్దడం వల్ల అది ముఖంపై చెడు ప్రభావం చూపిస్తుందట.

  • Mar 30, 2023, 21:03 PM IST

Side Effects Of Soap On Face: శరీరంపై మురికిని, బ్యాక్టీరియాను తొలగించడంలో సబ్బు కీలకమైనది. కానీ సబ్బుతో ముఖంపై అప్లై చేస్తే.. అది చర్మంలోని తేమను పోయేలా చేయడమే కాకుండా ముఖం పొడివారిపోయేలా చేస్తుంది. ప్రతీ రోజూ మీ ముఖాన్ని సబ్బుతో వాష్ చేస్తున్నట్టయితే.. వెంటనే ఆ ప్రక్రియను ఆపేయాల్సిందే అంటున్నారు స్కిన్ కేర్ ఎక్స్‌పర్ట్స్. లేదంటే.. మీ చర్మం పొడిబారిపోయి, చర్మంలో తేమ లేకపోవడం వల్ల దురద రావడం లేదా నిర్జీవంగా మారడం జరిగే ప్రమాదం ఉంటుందట. 

1 /6

Side Effects Of Soap On Face: వాస్తవానికి శరీరానికి సబ్బు ఎంతో మేలు చేస్తుంది. చర్మంపై పేరుకుపోయిన మురికిని, మృతకణాలను తొలగిస్తుంది. సబ్బు వినియోగం వల్ల ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ముఖానికి మాత్రం హాని చేస్తుందట.

2 /6

Side Effects Of Soap On Face: స్కిన్ కేర్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్న అభిప్రాయం ప్రకారం.. సబ్బులోని కెమికల్ టాక్సిన్స్ ముఖంపై ఉండే చర్మంలోకి ప్రవేశించం ద్వారా దురద రావడం, మంటగా అనిపించడం, ముడతలు రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

3 /6

Side Effects Of Soap On Face: వైరస్‌లు, హానికరమైన బాక్టీరియా, ఫంగస్ దాడి నుండి చర్మం లోపలి పొరలను రక్షించే కణాలు సూక్ష్మజీవుల రూపంలో ఉంటాయి. అయితే, సబ్బులో ఉండే రసాయనాలు ముఖంపై ఉన్న బ్యాక్టీరియాను, మురికిని తొలగించే క్రమంలో కణాల రూపంలో ఉన్న ఈ సూక్ష్మ జీవులను కూడా చంపేస్తాయి. ఈ కారణంగానే కొంతమందికి తరచుగా ముఖంపై ఏదో ఒక చోట వాపు, ఇన్ఫెక్షన్, మొటిమలు రావడం వంటి సమస్యలను ఫేస్ చేస్తుంటారు.

4 /6

Side Effects Of Soap On Face: చాలామంది ముఖంపై నల్లటి మచ్చల సమస్యతో బాధపడుతుంటారు. ఈ సమస్యకు కూడా కొన్నిసార్లు ముఖంపై సబ్బును ఉపయోగించడమే కారణం అయ్యే అవకాశాలు ఉన్నాయంట. ప్రతిరోజూ ముఖంపై సబ్బుతో రాయడం వల్ల ముఖంపై ఉండే స్వేద రంధ్రాలు మూసుకుపోతాయి. స్కిన్ కేర్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్న అభిప్రాయం ప్రకారం, చాలా వరకు సబ్బుల్లో ఉండే కొవ్వుతో కూడిన ఆమ్లాలు ముఖంపై ఉన్న రంధ్రాలను మూసేస్తాయి. ఫలితంగా ఇన్ఫెక్షన్స్, బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలు ఎదురవుతుంటాయి.

5 /6

Side Effects Of Soap On Face: ముఖాన్ని తాజాగా ఉంచి, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడే ఎన్నో రకాల విటమిన్లకు కూడా సబ్బు నుంచి హాని పొంచి ఉందట. ముఖంపై సబ్బును ఉపయోగించడం వల్ల చర్మం పొడిబారిపోయి ఆ విటమిన్స్ నాశనం అవుతాయి.

6 /6

Side Effects Of Soap On Face: ముఖానికి మేలు చేసే విటమిన్స్ పోవడం వల్ల ముఖం నిర్జీవంగా మారి చర్మం తన సహజ సౌందర్యాన్ని కోల్పోవడం, కాంతివిహీనంగా మారడం జరుగుతుంది అని చర్మ నిపుణులు చెబుతున్నారు.   (గమనిక: ఇక్కడ పేర్కొన్న వివరాలు హోమ్ రెమెడిస్, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ఎవరి ఆరోగ్య సమస్య విషయంలో వారికి అనేక వేర్వేరు కారణాలు ఉంటుంటాయి కనుక ఈ సమాచారాన్ని పరిష్కారంగా భావించడానికి ముందుగా తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని ZEE NEWS ధృవీకరించడం లేదనే విషయాన్ని గ్రహించాల్సిందిగా మనవి.)

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x