Andaman Islands: అండమాన్ అందాలు చూడతరమా..ఒక్కొక్క దీవిలో ఒక్కో ప్రత్యేకత

అండమాన్ నికోబార్ దీవుల అందాలు చూస్తే మైమర్చిపోతారు. అండమాన్ అందం అటువంటిది. నీలాకాశం ప్రతిబింబిస్తూ..నీలి నీటి మేఘాల్లో అత్యద్భుతంగా కన్పించే దీవుల సమాహారం. అండమాన్‌లోని ఈ దీవుల్ని చూడకపోతే..మీ యాత్ర అసంపూర్తిగా మిగిలిపోతుంది. అండమాన్‌లోని ప్రముఖ దీవులు, వాటి ప్రత్యేకత గురించి తెలుసుకుందాం..

Andaman Islands: అండమాన్ నికోబార్ దీవుల అందాలు చూస్తే మైమర్చిపోతారు. అండమాన్ అందం అటువంటిది. నీలాకాశం ప్రతిబింబిస్తూ..నీలి నీటి మేఘాల్లో అత్యద్భుతంగా కన్పించే దీవుల సమాహారం. అండమాన్‌లోని ఈ దీవుల్ని చూడకపోతే..మీ యాత్ర అసంపూర్తిగా మిగిలిపోతుంది. అండమాన్‌లోని ప్రముఖ దీవులు, వాటి ప్రత్యేకత గురించి తెలుసుకుందాం..

1 /6

రాస్ ఐల్యాండ్ పోర్ట్ బ్లయర్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఐల్యాండ్ చాలా విశిష్టమైనది. ఈ ఐల్యాండ్ భారత నావికాదళానికి చెందింది. ఇక్కడికొచ్చే పర్యాటకులు రిజిస్టర్‌లో ఎంట్రీ తప్పనిసరి.

2 /6

ప్యారెట్ ఐల్యాండ్ పక్షులంటే ఇష్టపడేవారికి ఈ ప్రాంతం చాలా మంచి టూరిస్ట్ డెస్టినేషన్. ఇక్కడున్న మడ అడవుల్లో పెద్ద సంఖ్యలో రామచిలుకలు ఉన్నాయి.

3 /6

నార్త్‌బే ఐల్యాండ్ అండమాన్‌లో స్నార్క్లింగ్ కోసం ఇది మంచి అనువైన ప్రాంతం. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలున్నాయి. 

4 /6

బరెన్ ఐల్యాండ్ భారత ఉపఖండంలోని ఏకైన అగ్నిపర్వతం ఇక్కడే ఉంది.  ఈ ఐల్యాండ్‌లో జనాభా లేదు. ఈ ఐల్యాండ్ ఉత్తరభాగంలో అయితే చెట్లు కూడా లేవు.

5 /6

బ్లూ ఐల్యాండ్ ఈ దీవి ఇండియాకు చెందిన కొన్ని ప్రత్యేక రత్నాల్లో ఒకటి. ఇదొక ప్రశాంతమైన దీవి. నిత్యం ఉరుకులు పరుగులతో ఉండే పోటీ ప్రపంచానికి దూరంగా ఉంటుంది. స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతుంటాయి ఈ దీవిలో.

6 /6

హ్యావ్‌లాక్ ఐల్యాండ్ ఇక్కడ స్కూబా డైవింగ్ ప్రసిద్ధి. ప్రకృతి ప్రేమికుడి నుంచి మొదలుకుని..సాహసాలు చేసేవారికి ఈ ఐల్యాండ్ స్వర్గధామమే.