Sravana masam 2024: తెలంగాణాలో చికెన్, మటన్ ధరలు భారీగా పడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఒకవైపు పౌల్ట్రీ యజమానులు లబో దిబో మంటుండగా.. నాన్ వెజ్ ప్రియులు మాత్రం పండగ చేసుకుంటున్నారు.
ప్రస్తుతం శ్రావణమాసం నడుస్తోంది.ఈ నేపథ్యంలో.. శ్రావణ మాసంను ప్రజలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ మాసమంతా ప్రతిరోజు ఏదో ఒక పండగ ఉంటుంది. సోమవారం,శుక్రవారం, శనివారంలను ఎంతో పవిత్రంగా భావిస్తారు.
శ్రావణ మాసంలో చాలా మంది నాన్ వెజ్ లకు, మద్యంలకు దూరంగా ఉంటారు.ఈ మాసమంతా కఠినంగా ఉపవాస నియమాలు పాటిస్తుంటారు. అంతేకాకుండా..ఈ మాసంలో చాలా మంది చాతుర్మాస్యం వ్రతంలో కూడా ఉంటారు.
గత కొన్నిరోజులుగా చుక్కలు చూపించిన చికెన్, మటన్ ధరలకు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో నాన్ వెజ్ ప్రియులు మాత్రం కొందరు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లుతెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో..రెండు వారాల క్రితం.. కేజీ చికెన్.. రూ. 290 నుంచి 350 మధ్యలో ఉంది.
అంతేకాకుండా.. దాదాపు తెలంగాణ అంతట కూడా ఇదే రకంగా ధరలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా చికెన్ ధరలు భారీగానే తగ్గిపోయినట్లు తెలుస్తోంది. కేజీ చికెన్ ధర ఇక్కడ రూ. 270 నుంచి అమాంతం రూ. 180 కి పడిపోయిందని తెలుస్తోంది. మటన్ కూడా కేజీ రూ. 150 కి పడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
మరోవైపు కోడిగుడ్ల ధరలు కూడా భారీగా పడిపోయినట్లు తెలుస్తోంది. ఒక గుడ్డు ధర 8 నుంచి 10 వరకు అమ్మగా.. ఇప్పుడు.. 6 రూ. లకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ధరలు ఇదే విధంగా కాస్తంత అటు, ఇటుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వైపు శ్రావణం, మరోవైపు వరుస పండుగల నేపథ్యంలో చాలా మంది నాన్ వెజ్ కు, మద్యానికి మాత్రం ఈనెలలో దూరంగా ఉంటారు.
అందుకే ప్రస్తుతం చికెన్ ధరలు ఒక్కసారిగా కొండ దిగినట్లు తెలుస్తోంది. ఇక శ్రావణంలో ఉపవాసాలు చేయనివారికి మాత్రం ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. వీరు ఈ నెలంతా తమకు నచ్చిన నాన్ వెజ్ ను అతి తక్కువ ధరకే పొంద వచ్చు. అనేక షాపుల్లో, చికెన్ , మటన్ లను తక్కువ ధరకే అమ్ముతున్నట్లు తెలుస్తోంది.