Sreeleela: బాస్ లుక్ లో శ్రీలీల.. స్టైలిష్ ఫిక్స్ వైరల్

Sreeleela Stylish Pics: తక్కువ సమయంలోనే తెలుగులో సెన్సేషనల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుండి శ్రీలీల. సినిమాల్లోనే కాకుండా ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో సైతం సెన్సేషనల్ గా నిలుస్తోంది

1 /5

దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందడి అనే చిత్రంతో.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శ్రీ లీల. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది.

2 /5

వెంటనే రెండో సినిమా రవితేజతో ఛాన్స్ అందుకుంది. ఇక రవితేజ హీరోగా వచ్చిన ధమాకా చిత్రంతో శ్రీలీల తెలుగులో సెన్సేషనల్ గా మారిపోయింది. ముఖ్యంగా ఆమె డాన్స్ చూసి అందరూ ఫిదా అయిపోయారు

3 /5

అప్పటినుంచి శ్రీలీలా కి తెలుగులో తిరుగులేకుండా పోయింది. వరసగా ఒకేసారి 9 సినిమా అవకాశాలు అందుకుని అందరిని ఆశ్చర్యపరిచింది.

4 /5

ఈ మధ్యనే గుంటూరు కారం సినిమాలో కనిపించిన శ్రీలీల.. త్వరలో తమిళ ఇండస్ట్రీకి కూడా అడుగుపెట్టనుందని వినికిడి.‌ అజిత్ హీరోగా చేస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ కోసం. శ్రీలీలని సంప్రదించారంట సినిమా యూనిట్.

5 /5

ఈ క్రమంలో శ్రీలీల ఇన్స్టాగ్రామ్ ఫోటోలు వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలలో శ్రీలీల బిస్కెట్ కోట్ వేసుకొని.. గాగుల్స్ పెట్టుకొని బాస్ స్టైల్ లో భలే కనిపించింది..