Sreeleela: పింక్ చీరలో శ్రీలీల.. ఫోటోలు చూస్తే వారేవా అనాల్సిందే..

Sreeleela Hot Photos: వరసగా తొమ్మిది సినిమాలు సైన్ చేసి సెన్సేషనల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది శ్రీలీల. సినిమాల్లోనే కాదు ఈ అమ్మడు ఇంస్టాగ్రామ్ లో కూడా ఆమె అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది.

  • Mar 06, 2024, 15:12 PM IST
1 /5

స్టార్ హీరోలకు ఏమాత్రం తీసుపోదు అన్నట్టుగా తెలుగులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ శ్రీలీల. అచ్చమైన తెలుగు అమ్మాయి అయినప్పటికీ కన్నడ సినిమాల ద్వారా తన సినీరంగ ప్రవేశం చేసింది ఈ హీరోయిన్.

2 /5

కన్నడ లో తాను చేసిన మొదటి సినిమా కిస్ మంచి విజయం సాధించింది. ఆ తరువాత రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.  

3 /5

రవితేజ ధమాకా చిత్రంతో సెన్సేషనల్ హీరోయిన్ గా మారి వరస అవకాశాలు అందుకోవడం ప్రారంభించింది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా తొమ్మిది చిత్రాలు ఒకేసారి అందుకుంది ఈ హీరోయిన్.

4 /5

అయితే అన్ని సినిమాల కన్నా శ్రీలీల బాలకృష్ణతో చేసిన భగవంత్ కేసరి ఆమెకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. శ్రీలీల లో అద్భుతమైన నటన కూడా ఉంది అని రుజువు చేసింది ఈ చిత్రం.

5 /5

ఈ మధ్య మహేష్ బాబు గుంటూరు కారంలో కనిపించిన శ్రీలీల ప్రస్తుతం వరస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ చీరలో చందమామలా కనిపిస్తున్న ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి.