Sreeleela: చీరలో శ్రీ లీల.. ఆరెంజ్ రంగులో నారింజ పండులా!

Sreeleela  Instagram Pics: తెలుగులో అతి కొద్దిగా కాలంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరోయిన్స్ లో శ్రీలీల ఒకరు. ఒకేసారి వరుసగా తొమ్మిది సినిమా అవకాశాలు అందుకొని.. స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. సినిమాలతోనే కాకుండా తరుచూ ఇన్స్టాగ్రామ్ ఫోటోల ద్వారా కూడా ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ హీరోయిన్. ప్రస్తుతం శ్రీలీల షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి.

1 /5

వరస అవకాశాలతో తెలుగు ప్రేక్షకులు అందరిని తన వైపు తిప్పుకుంది శ్రీలీల. ఒకేసారి 9 సినిమాలు సైన్ చేసి.. సెన్సేషనల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. తన అందం.‌..అభినయం వల్ల మహేష్ బాబు గుంటూరు కారం.‌ పవన్ కళ్యాణ్ ఉస్టాడ్ గబ్బర్ సింగ్ లాంటి సినిమాలలో కూడా అవకాశం అందుకుంది.

2 /5

ముఖ్యంగా బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో.. శ్రీలీల నటించిన.. భగవంత్ కేసరి ఆమెకు మంచి పేరు.. తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో తాను ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగలనని రుజువు చేసుకుంది. 

3 /5

అయితే ఆ తరువాత మెగా కాంపౌండ్ హీరో వైష్ణవి తేజ్ తో ఈ హీరోయిన్ చేసిన.. ఆది కేశవ ఆమె కెరియర్ పై పెద్ద దెబ్బ కొట్టింది. శ్రీలీల అసలు ఎందుకు ఇలాంటి సినిమాలు ఒప్పుకుంటుంది అనేటట్లు.. అనుమానాలు క్రియేట్ చేసింది.  

4 /5

దీంతో ప్రస్తుతం ఆచితూచి సినిమాలకు అంగీకారం తెలుపుతోంది శ్రీ లీల. ఈ క్రమంలో ప్రస్తుతం రవితేజ సినిమా.. పవన్ కళ్యాణ్ సినిమా మాత్రమే ఈమె ఒప్పుకుంది. ఇక ఈ మధ్యనే రవితేజ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి.

5 /5

ఆ కార్యక్రమంలో శ్రీలీల కత్తుకున్న చీర అప్పట్లో అందరి దృష్టిని ఆకట్టుకుంది. కాగా ఇప్పుడు అదే చీరలో తన ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేసి.. ఆమె అభిమానులను ప్రేమలో పడేస్తోంది ఈ హీరోయిన్.