Sreeleela: పుష్ప -2 లో శ్రీ లీల ఐటెం సాంగ్ రెమ్యునరేషన్ .. సమంత కంటే ఎక్కువ లేదా తక్కువ..?

Sreeleela remuneration: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ చేసి భారీ పాపులారిటీ అందుకుంది.. ఇప్పుడు పుష్ప -2 సినిమాలో శ్రీ లీల ఐటమ్ సాంగ్ చేయబోతోంది.

1 /5

యంగ్ హీరోయిన్ శ్రీ లీల గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అద్భుతమైన నటనతో, డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ధమాకా సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. 

2 /5

అంతేకాదు ఒకే ఏడాది తొమ్మిది సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హీరోయిన్ గా రికార్డ్ సృష్టించింది శ్రీ లీల. ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పుష్ప -2 సినిమాలో ఐటెం సాంగ్ కోసం ఎంపికయింది. 

3 /5

ఇప్పటికే ఈ పాటలో నర్తించడానికి చాలామంది  హీరోయిన్స్ పేర్లు బయటకు వచ్చాయి. కానీ చివరిగా ఈమె పేరు కన్ఫర్మ్ అయ్యింది. ఇకపోతే ఇక్కడ ఐటమ్ సాంగ్ కోసం శ్రీ లీలా పారితోషకం హాట్ టాపిక్ గా మారింది.

4 /5

గతంలో పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం సమంత రూ.5 కోట్లు తీసుకుంది. శ్రీ లీల ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం కేవలం రూ .2కోట్లు మాత్రమే పారితోషకం తీసుకోబోతుందని సమాచారం. 

5 /5

ఇకపోతే ప్రస్తుత జనరేషన్ లో సమంత  కంటే శ్రీ లీలాకి తక్కువ పారితోషికం ఇచ్చారు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.