Heroine: స్టార్ నటి అఫైర్ వెనుక పెద్ద కథ.. బయటపడిన అసలు నిజం..

Actress: సినిమా అనే రంగుల ప్రపంచంలో జీవించాలి అంటే నటన, అందంతో పాటు ధైర్యం కూడా ఉండాలి.  అప్పుడే ఇండస్ట్రీలో ముందడుగు వేయవచ్చు. మరీ ముఖ్యంగా గ్లామర్ ఫీల్డ్ లో మంచి ఎంత ముందుకు వస్తుందో..  దాని వెనుక చెడు కూడా రెట్టింపు వేగంతో దాడి చేస్తుంది అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా చెడును కూడా ఎదుర్కొని ముందుకు వెళ్లిన వాళ్లే ఇండస్ట్రీలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. 
 

1 /5

సినీ ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని,  అటు చెడును ఇటు మంచిని రెండింటిని తీసుకొని.. ముందుకు వెళ్లిన అతి తక్కువ మంది సెలబ్రిటీస్ లో నటి కస్తూరి కూడా ఒకరు. టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లో కూడా నటించి మంచి పేరు సొంతం చేసుకున్న ఈమె దాదాపు మూడున్నర దశాబ్దాల నుండి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో చిత్రాలతో పాటు తెలుగు బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరిస్తోంది. 

2 /5

మొదట నాగార్జున హీరోగా.. నటించిన అన్నమయ్య సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కస్తూరీ శంకర్.. ఆ తర్వాత తన అందచందాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. సినిమాలలో ఎంత గుర్తింపు అయితే తెచ్చుకుందో సీరియల్స్ ద్వారా అంతకుమించి పాపులారిటీ అయిందని చెప్పవచ్చు.  ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ తో ఆమె నటన మరొకసారి వెలుగులోకి వచ్చింది.   

3 /5

ఐదు పదుల వయసులో కూడా యంగ్ బ్యూటీ లా.. కనిపిస్తూ తన హాట్ ఫోటోలతో కుర్ర కారుకు చెమటలు పట్టించిన ఈమె.. సినిమాలే కాకుండా ఇండస్ట్రీలో ఆడవాళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కూడా పలుమార్లు చర్చించింది. ఈ క్రమంలోనే 60 సంవత్సరాల వయసులో ఒక ముసలాడితో ఎఫైర్ నడుపుతోంది..అంటూ ఒక వార్త అప్పట్లో సంచలనం సృష్టించింది.  తాజాగా ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చింది కస్తూరి శంకర్.   

4 /5

తమిళనాడుకు చెందినటువంటి నటిని అయిన నేను ఒక 60 ఏళ్ల వ్యక్తితో ఎఫైర్ పెట్టుకున్నానని , అంతేకాదు అతడు నా కోసం లండన్ లో ఇల్లు కూడా కొనిపెట్టారు అనే..పుకార్లు వినిపించాయి. దాంతో ఆ పుకార్లకు నేను ఒక్కసారిగా భయపడిపోయాను. ఇండస్ట్రీ లోకి రావాలంటే కూడా భయం వేసింది.  ఇంట్లోనే ఉన్నాను. 

5 /5

అప్పుడే ఒక తండ్రి లాంటి వ్యక్తి నన్ను బయటకు.. తీసుకొచ్చారు. నువ్వు ఇలాగే ఇంట్లో ఉంటే తప్పు చేసిన దానివి అనుకుంటారు. బయటకు వెళ్లి నువ్వేంటో నిరూపించుకో అని చెప్పారు.. అలా బయటికి వచ్చి ఆ తర్వాత నన్ను నేను నిరూపించుకున్నాను.. అలా ఎన్నో రూమర్లు ఎన్నో విధాలుగా వచ్చినా  వాటన్నింటినీ తట్టుకొని నేడు ఈ స్థాయికి వచ్చాను అంటూ తెలిపింది కస్తూరి శంకర్.