Sun Transit 2024: మరో 25 రోజుల పాటు విపరీతమైన లాభాలు పొందే రాశులు..


Sun Transit Effects 2024: అన్ని గ్రహాలకు కింగ్‌ పరిగణించే సూర్యుడు ఎన్నో రోజుల తర్వాత చంద్రుడు అధిపతిగా వ్యవహరించే రాశిలోకి ప్రవేశించాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ సంచారానికి ప్రత్యేకమైన ప్రముఖ్యత ఉంటుంది. ఈ సంచార ప్రభావం దాదాపు రాబోయే 25 రోజుల పాటు ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. జూలై 16వ తేదిన కర్కాటక రాశిలోకి వెళ్లిన సూర్యుడి ప్రభావంతో ఏయే రాశివారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
 

1 /7

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు జాతకంలో శుభస్థానంలో ఉంటే ఈ రాబోయే 25 రోజుల పాటు ఆ రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. అదే అశుభ స్థానంలో ఉంటే అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి.   

2 /7

రాబోయే 25 రోజుల పాటు సింహ రాశివారికి ఎలాంటి డోకా ఉండదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరికి జీవిత భాగస్వామి సపోర్ట్‌ లభించి అనుకున్న పనులు వెంటనే జరుగుతాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.  

3 /7

అంతేకాకుండా సూర్యుడి అనుగ్రహం లభించి ఆర్థికంగా కూడా విపరీతమైన లాభాలు కలిగే ఛాన్స్‌ ఉందని జ్యోతిస్యులు తెలుపుతున్నారు. అలాగే జీవితంలో ఇబ్బందులు కూడా తొలగిపోతాయి.   

4 /7

ఈ సూర్యుడి సంచారం ప్రభావం వృశ్చిక రాశివారికి కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరకి ఆగిపోయిన పనులు కూడా ఎంతో సులభంగా ప్రారంభమవుతాయి. దీంతో పాటు వ్యాపారాల్లో లాభాలు కూడా వెంటనే రావడం ప్రారంభమవుతుంది.

5 /7

అంతేకాకుండా కెరీర్‌కి సంబంధించిన విషయంలో ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి ఆగిపోయిన ప్రమోషన్స్‌ కూడా తిరిగి పొందుతారు. అలాగే ఉద్యోగాలు చేసేవారికి విదేశాలకు వెళ్లే ఛాన్స్‌ ఉంది. 

6 /7

మీన రాశివారికి ఈ సూర్యుడు సంచారం చేయడం వల్ల 25 రోజుల పాటు విపరీతమైన లాభాలు కలుగుతాయి. దీని కారణంగా వీరికి ఖర్చులతో పాటు లాభాలు కూడా పెరుగుతాయి. దీంతో పాటు వీరు కొత్త పనులు కూడా ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయి.   

7 /7

వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తవుతాయి. అంతేకాకుండా వీరి జీవితం కూడా ఎంతో బాగుంటుంది. అలాగే కుటుంబ జీవితంలో సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారమవుతాయి.