మకర సంక్రాంతి రోజున సూర్యుడి సంచారం వల్ల ఏ రాశుల వారికి లాభాలు కలుగుతాయి?

2024 Makar Sankranti Rasi Palan: సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి సంచరించే సమయాన్ని సంక్రమణం అని అంటారు. ఏ రాశిలో ప్రవేశిస్తాడో ఆ రాశి పేరునే సంక్రాంతి అని పిలవడం ఆనవాయితీ.  2024 జనవరి  15న సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. మకరరాశిలో ప్రవేశించిన సూర్యుడు ప్రభావం ఇతర రాశులపైనా కూడా ఉంటుంది. అయితే కొన్ని రాశిలపై అదృష్ట సంకేతాలు కనిపిస్తాయి. ఏయే రాశులకు అదృష్టం వరిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.. 

  • Jan 10, 2024, 14:27 PM IST
1 /10

గ్రహాలకు అధిపతి అయిన సూర్య గ్రహం ప్రతి నెలా తన రాశిని తన రాశిని వదిలి ఇతర రాశిలోకి సంచారం చేస్తుంది. అయితే 2024లోని జనవరిలో కూడా ఈ సూర్య గ్రహం సంచారం చేయనుంది. 

2 /10

ప్రతి సంవత్సరం జనవరి నెలలో మకర సంక్రాంతి రోజున సూర్యుడు సంచరిస్తాడు. ఈసారి జనవరి 15న సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు.

3 /10

సంక్రాంతి అంటే.. సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారడమే సంక్రాంతిగా చెబుతారు. ఏ రాశిలో ప్రవేశిస్తాడో ఆ రాశి పేరునే సంక్రాంతి అని పిలవడం ఆనవాయితీగా వస్తుంది. అయితే సూర్యుడు మకర రాశిలో సంచరిస్తాడు కాబట్టి ఈ రోజును మకర సంక్రాంతిగా చెబుతాము.

4 /10

మకరరాశిలో సూర్యుని సంచార ప్రభావం అన్ని రాశులపైనా ఉంటుంది. అయితే, కొన్ని రాశులలో ఈ మార్పు అధిక ప్రయోజనాలను కలిగిస్తుంది. 

5 /10

సూర్యుని సంచారం వల్ల మేషరాశి వారికి విజయాలు చేకూరుతాయి. మీ కెరీర్‌లో చాలా మంచి అవకాశాలు పొందుతారు. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. 

6 /10

వృషభ రాశిలో సూర్యడు సంచారించడంతో ఈ సంవత్సరం వృత్తిపరంగా చాలా అదృష్టం అని చెప్పవచ్చు. పెట్టుబడుల నుంచి  మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది.

7 /10

సూర్యుడి సంచారంతో సింహ రాశివారిపై ప్రత్యేక ప్రభావం పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో పట్టుదలతో పనులు చేయడం వల్ల సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా సమాజంలో గుర్తింపు పొందుతారు.

8 /10

సూర్యుడి సంచారంతో వృశ్చిక రాశివారు కూడా ఊహించని లాభాలు పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి ఈ సంక్రాంతి చాలా కలిసివస్తుంది. దీని కారణంగా వీరు ప్రమెషన్స్‌ పొందుతారు. భార్యభర్తలు మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి.

9 /10

సూర్యుని సంచారం కారణంగా మీన రాశి వారికి  కెరీర్‌లో మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లు కూడా  పొందుతారు. ఆర్థికంగా ఈ రాశి వారికి ఎన్నో లాభాలు పొందుతారు.

10 /10

ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ఈ సమాచారాన్ని జీ తెలుగు న్యూస్‌ ధృవీకరించలేదు