Mahesh Babu House Pics: మహారాజా భవనాన్ని మించేలా ప్రిన్స్ మహేష్‌ బాబు ఇల్లు.. చూస్తే మైండ్ బ్లోయింగ్..!

Mahesh Babu House Pics:  మహేష్ బాబు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ సూపర్ స్టార్ కి సంబంధించి.. ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మహేష్ బాబు ఇల్లు ఫోటోలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి. మహేష్ బాబు ఇల్లు గురించి మరిన్ని వివరాలు మీకోసం..

1 /5

రాజకుమారుడు సినిమా ద్వారా హీరోగా.. పరిచయమయ్యారు మహేష్ బాబు. అంతకుముందే బాలనటుడిగా.. ఎన్నో సినిమాలలో నటించారు. సినిమాల్లోకి అడుగు పెట్టింది సూపర్ స్టార్ కొడుకుగానే అయినా.. అతని నటన వల్ల.. తానే సూపర్ స్టార్ గా ఎదిగారు.  

2 /5

మహేష్ బాబు నటించిన ఒక్కడు,‌ అతడు,‌ పోకిరి లాంటి సినిమాలు.. అతనికి తెలుగు ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్..ని తెచ్చిపెట్టాయి. ఈ మూడు సినిమాలు అప్పట్లో ఇండస్ట్రీ సూపర్ హిట్స్ గా మిగిలాయి. ముఖ్యంగా పోకిరి సినిమా.. మహేష్ బాబుని తెలుగు ఇండస్ట్రీలో.. సూపర్ స్టార్ గా నిలబెట్టింది. 

3 /5

కాగా మహేష్ బాబు ఈరోజుతో.. 48 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. అయితే వయసు పెరిగిన.. ఈ హీరోకి అందం మాత్రం తగ్గడం లేదని.. అందరూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు తన 29వ సినిమా రాజమౌళితో చేయనున్నారు. పాన్ వరల్డ్ సినిమాగా రానున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. 

4 /5

ఈ క్రమంలో మహేష్ బాబు ఇంటికి సంబంధించిన ఫోటోలు.. ఆయన బర్త్డే సందర్భంగా వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి. మహేష్ బాబు ఇల్లు చూడడానికి ఇంద్ర భవనంలా కనిపిస్తూ.. అందరినీ ఆకట్టుకుంటోంది. జూబ్లీహిల్స్ లో ఉన్న ఈ ఇల్లు ఖరీదు.. అక్షరాల 28 కోట్లు.   

5 /5

ఉధన్ ఫర్నిచర్, డార్క్ వాల్స్.. ఎంతో అందమైన స్విమ్మింగ్ పూల్.. లాంటి వాటితో.. ఈ ఇల్లు చూసిన వారిని ప్రేమలో పడేస్తోంది. ఈ ఇంట్లో ఫోటోలను మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్.. తరచూ తమ సోషల్ మీడియా పేజీల్లో పోస్ట్ చేస్తూ ఉంటారు.