Venkatesh Brother Interview: ప్రముఖ నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. తన వయసులో ఉన్నప్పుడు జరిగిన కొన్ని విశేషాలను పంచుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాను కమలహాసన్ లాగా ఉండడం వల్లే తన కారును చాలామంది ఆపేవారు అంటూ సురేష్ బాబు తెలిపారు..
తెలుగు సినీ ఇండస్ట్రీలో మూవీ మొగల్ గా పేరు పొందారు నిర్మాత, నటుడు రామానాయుడు.. రామానాయుడు ఎన్నో చిత్రాలను నిర్మించి, తెలుగు సినిమా పరిశ్రమను మరొక స్థాయికి తీసుకువెళ్లారు. టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా కొనసాగారు రామానాయుడు. ఈయన వారసత్వాన్ని కొనసాగిస్తూ సురేష్ బాబు ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా కొనసాగుతూ ఉన్నారు. సురేష్ బాబు ఏదైనా ఒక కథను జడ్జ్ చేయడంలో తనకున్న అనుభవమే తనని ఈ స్థాయిలో నిలబెట్టిందని, ఇప్పటికే ఎన్నోసార్లు రుజువు చేసుకున్నారు కూడా.
అయితే రామానాయుడు మాత్రం తన కుమారులను ఇండస్ట్రీకి తీసుకురాకూడదని, ఒకవేళ తీసుకువస్తే ప్రమాదమని గ్రహించి, ఉన్నత చదువులను చదివించారు. కానీ చివరికి వీరు సినీ ఇండస్ట్రీకే పరిమితమయ్యారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సురేష్ బాబు మాట్లాడుతూ.. ఎన్నో విషయాలను తెలియజేశారు.
సురేష్ బాబు మాట్లాడుతూ.. తనకు ఎక్కువగా వ్యాపార రంగంలో రాణించడం చాలా ఇష్టమని, అలా అమెరికాలో ఇంజనీరింగ్ ను కూడా పూర్తి చేశానని, అందుకు తగ్గట్టుగా అమెరికా నుంచి వచ్చాక ఒక స్నేహితుల సహాయంతో ఒక కంపెనీని కూడా మొదలు పెట్టానని.. అది స్పార్టెక్ సిరామిక్స్ అనే కంపెనీని ప్రారంభించినా.. అది వర్కౌట్ కాలేకపోయిందని తెలిపారు.
ఇలా వ్యాపారం అచ్చి రాలేదని, చివరికి తన తండ్రి ఆఫీసులోని కూర్చునేవారట సురేష్ బాబు. ఆ సమయంలోనే ఎక్కువగా కథలు వినడం, వాటిని జడ్జ్ చేయడం మొదలు పెట్టారట. అలా నెమ్మదిగా తనలో ఉన్న టాలెంట్ ను బయట పెట్టుకున్నారు సురేష్ బాబు.
అంతేకాకుండా తాను యుక్త వయసులో ఉన్నప్పుడు కమలహాసన్ గా ఉండే వాడిని అంటూ చెప్పుకొచ్చారు. తనను చూసి చాలామంది కమలహాసన్ అనుకునేవారని, అంతే కాకుండా కార్లు కూడా ఒకే రకమైనవిగా ఉండడంతో చాలామంది కమల్ హాసన్ అనుకొని తన కారుని ఆపే వారంటూ révél చేశారు.
అలాగే డైరెక్టర్ భారతి రాజా గారు తనకోసం ఒక సినిమాలో నటించమని సంప్రదించగా.. ఆ ఆఫర్ ని తాను తిరస్కరించానని, తాను ఎప్పుడూ కూడా నటన పైన ఆసక్తి కనబర్చలేదని, అందుకే తాను నటనకు దూరంగా ఉన్నానని, ప్రస్తుతం నిర్మాతగా అయితే కొనసాగుతున్నానని తెలిపారు సురేష్ బాబు.