Tamannaah Bhatia: తమన్నా కొత్త ఫోటోలు చూశారా.. ప్రేమలో పడటం ఖాయం

Tamannaah Bhatia Sensational Pics: 

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ఎంత చెప్పినా తక్కువే. దశాబ్ద కాలం పైగా స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. సినిమాలతోనే కాకుండా తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా కూడా అభిమానులను తెగ ఆకట్టుకుంటూ ఉంటుంది తమన్నా

  • Mar 23, 2024, 20:19 PM IST
1 /5

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరోయిన్ తమన్నా. హిందీ చిత్రం చాంద్ సా రోషన్ చెహ్రా తో తమన్నా తన సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తరువాత మనోజ్ హీరోగా చేసిన శ్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

2 /5

2005 సంవత్సరంలో విడుదలైన శ్రీ సినిమా పరవాలేదు అనిపించుకోగా 2007లో విడుదలైన హ్యాపీడేస్ చిత్రం తమన్నాకి సూపర్ సక్సెస్ సాధించి పెట్టింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

3 /5

ఆ తరువాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్, ఊసరవెల్లి, రచ్చ, బాహుబలి లాంటి చిత్రాలలో కనిపించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

4 /5

కాగా కల్లూరి అనే సినిమాతో 2007లో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తమన్నా అక్కడ కూడా ఎన్నో చిత్రాలలో కనిపించి మెప్పించింది. గత కొద్ది రోజులుగా వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ పేరు తెచ్చుకుంది.

5 /5

ఈ క్రమంలో ఈ మధ్య ఇంస్టాగ్రామ్ లో లో తమన్నా గ్రీన్ డ్రెస్ లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలలో తమన్నా గ్రీన్ యపిల్ లాగా మెరిసిపోతూ అభిమానులను ఫిదా చేస్తోంది.