Tata Punch Vs Tata Punch Ev: టాటా కార్లు కొనేవారు ఈ రెండింటి తేడాలు తప్పకుండా తెలుసుకోండి!

Tata Punch Vs Tata Punch Ev: ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన టాటా పంచ్‌ EVకి, సాధరన పంచ్‌కి మధ్య బోలెడు తేడాలు ఉన్నాయి. అయితే ఈ రెండింటి మధ్య ఉన్న ప్రధాన తేడాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


Tata Punch Vs Tata Punch Ev: భారత మార్కెట్‌తో పాటు ప్రపంచ మార్కెట్‌లలో టాటా కార్లకు ఎంత గుర్తింపు ఎందో అందిరికీ తెలిసింది. అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌ కలిగి ఉండడం వల్ల మిడిల్‌ క్లాస్ కస్టమర్స్‌ ఈ కార్లను కొనుగోలు చేసేందుకు మెగ్గు చూపుతారు. ముఖ్యంగా ఇటీవలే టాటా కంపెనీ విడుదల చేసిన టాటా పంచ్‌ ఈవీకి మంచి ప్రజాదరణ లభించింది. అయితే గతంలో లాంచ్‌ చేసిన టాటా పంచ్‌ కంటే, ఇటీవలే విడుదల చేసిన EV వేరియంట్‌ అనేక రకాల శక్తివంతమైన ఫీచర్స్‌ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ రెండింటి మధ్య ఉన్న ప్రధాన తేడాలేంటో పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

1 /6

సాధరణ టాటా పంచ్‌ కారు పెట్రోల్ వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇక టాటా పంచ్‌ ఈవీ మాత్రం పూర్తి ఎలక్ట్రిక్‌ కారుగా లాంచ్‌ అయ్యింది. అంతేకాకుండా కొత్త పంచ్‌ వివిధ కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది.   

2 /6

టాటా పంచ్‌ కారు ధర వివరాల్లోకి, ఇది రూ.5.49 లక్షల నుంచి రూ.9.09 లక్షలతో అందుబాటులో ఉంది. ఇక టాటా పంచ్‌ ఈవీ వేరియంట్‌ రూ.10.99 లక్షల నుంచి రూ.13.99 లక్షలతో లభిస్తోంది.

3 /6

టాటా పంచ్‌ సాధరణ వేరియంట్‌ 18.97 కి.మీ/లీ (పెట్రోల్) మైలేజ్‌తో లభిస్తోంది. ఇక టాటా పంచ్‌ ఈవీ వేరియంట్‌ మాత్రం ఒక్క సారి ఛార్జ్‌ చేస్తే 300 కి.మీ మైలేజ్‌తో లభిస్తోంది. 

4 /6

టాటా పంచ్‌ వేరియంట్‌ పనితీరు విషయానికొస్తే, 1.2L పెట్రోల్ ఇంజన్, 86 PS శక్తి, 113 Nm టార్క్ వంటి ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. టాటా పంచ్‌ ఈవీ వేరియంట్‌, 40 kW ఎలక్ట్రిక్ మోటార్, 130 PS శక్తి, 260 Nm టార్క్ ఫీచర్స్‌తో లభిస్తోంది.  

5 /6

సాధరణ టాటా పంచ్‌ ఎలాంటి ఛార్జింగ్‌ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. ఇక టాటా పంచ్‌ ఈవీ కారు.. 100% ఛార్జ్‌ కావడానికి 5 నుంచి 6 గంటలు (AC ఛార్జర్‌తో)తో అందుబాటులోకి వచ్చింది. ఇది  26.2 kWh లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది.   

6 /6

టాటా పంచ్‌ ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే, ఇది టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, సన్‌రూఫ్, క్రూజ్ కంట్రోల్‌తో లభిస్తోంది. ఇక టాటా పంచ్‌ ఈవీ వేరియంట్‌ కూడా పై ఫీచర్స్‌తో పాటు రిజెనరేటివ్ బ్రేకింగ్, ఎకో మోడ్‌లను కలిగి ఉంటుంది.