Teacher's Day 2024: రేపు టీచర్స్‌ డే సందర్భంగా మీ ఉపాధ్యాయులకు ఈ 5 బహుమతులుగా ఇవ్వచ్చు..

Teacher's Day 2024 Gift Ideas: ప్రతి ఏడాది సెప్టెంబర్‌ 5న ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటారు. అన్ని స్కూళ్లలో ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహిస్తారు. విద్యార్థులకు తమ గురువు పై ఉండే కృతజ్ఞతను తెలుపుతారు. ఆ రోజు వివిధ పోటీలు నిర్వహిస్తారు. తమ టీచర్లకు బహుమతులు ఇస్తారు. ఈరోజు మీరు ఉపాధ్యాయులకు ఇవ్వగలిగే 5 గిఫ్ట్‌ ఐడియాస్‌ గురించి తెలుసుకుందాం.
 

1 /5

మగ్‌.. టీచర్స్‌ డే సందర్భంగా కాఫీ మగ్స్‌ పర్సనలైజ్‌ చేసి మీ టీచర్లకు ఇవ్వచ్చు. మీ ఉపాధ్యాయుల ఫోటోతో డిజైన్‌ చేయించి వారికి బహుమతిగా ఇవ్వచ్చు.  దానిపై ఏదైనా వారి పేరు, సందేశాన్ని కూడా  రాసి ఇవ్వచ్చు. ఈ పర్సనలైజ్డ్‌ మగ్‌ ఈజీగా మార్కెట్లో దొరుకుతుంది. మీ టీచర్‌కు మీరు ఇచ్చే ఓ అద్భుతమైన బహుమతి.

2 /5

ఫోటో కాలేజ్.. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా వారి అద్భుతమైన క్షణాలను ఫోటో రూపంలో క్యాప్చర్‌ చేసి బహుమతిగా ఇవ్వచ్చు. ఈ ఫోటో ఫ్రేమ్‌ మీ క్లాసులోని అపురూపమైన క్షణాలు క్యాప్చర్‌ చేసినవి ఇస్తే వారు మరింత ఆనందంగా తీసుకుంటారు.  ఆ ఫ్రేమ్‌పై మీ మీరు ఏదైనా సందేశాన్ని మీ ఉపాధ్యాయులను ఉద్దేశించి రాయవచ్చు. ఈ పర్సనలైజ్డ్‌ ఫోటో కాలేజ్ అర్థవంతంగా ఉంటుంది. ఇది హృదయానికి కూడా హత్తుకుంటుంది.

3 /5

సక్కలెంట్‌.. ఈ మధ్యకాలంలో గిఫ్ట్‌గా ఇలాంటి సక్కలెంట్‌ మొక్కలను కూడా ఇచ్చే వైఖరి కూడా బాగా పెరిగింది. మీ టీచర్‌ కూడా బహుమతిగా మార్కెట్లో అందుబాటులో ఉండే రకరకాల సక్కలెంట్‌ మొక్కలను అందించవచ్చు. ఇది మీ టీచర్‌ డెస్క్‌పై మరింత అందాన్ని పెంచుతుంది.

4 /5

కీచైన్‌.. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా కీచైన్‌ కూడా ఇవ్వచ్చు. వారు కార్‌, ఇల్లు లేదా స్కూలు అల్మైరా కీగా కూడా వినియోగించవచ్చు.ముఖ్యంగా కీచైన్‌ కూడా పర్సనలైజ్డ్‌ అందుబాటులో ఉంటున్నాయి. 

5 /5

గిఫ్ట్.. ఇవి కాకుండా మీ చేతులతో మీరు స్వయంగా తయారు చేసిన ఏదైనా పర్సనల్‌ గిఫ్ట్‌ను కూడా ఇవ్వచ్చు. కలర్‌ పేపర్స్‌కు స్ట్రాలు పెట్టి ఒక చిన్న గ్రీటింగ్‌ కార్డుపై బొకే మాదిరి తయారు చేసి ఇవ్వండి. దానిపై మీ చేతి గుర్తులు కూడా రంగురంగులో ఉండేలా వేయండి.