Shardul Thakur: శార్దుల్ ఠాకూర్ పెళ్లి ఫొటోలు.. హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గదుగా..

Shardul Thakur Mittali Parulkar Wedding Pics: ఓపెనర్ కేఎల్ రాహుల్, ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ తర్వాత మరో టీమిండియా స్టార్ క్రికెటర్ ఓ ఇంటి వాడయ్యాడు. పేస్ బౌలర్ శార్దుల్ ఠాకూర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. భార్య మిథాలీ పారుల్కర్‌తో కలిసి దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

  • Feb 28, 2023, 00:36 AM IST
1 /5

శార్దుల్ ఠాకూర్, మిథాలీ పారుల్కర్ నవంబర్ 2021లో నిశ్చితార్థం చేసుకున్నారు. 15 నెలల తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారి వివాహ కార్యక్రమాలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభమయ్యాయి. నేడు ఈ జంట ఏడడుగులు వేసింది.  

2 /5

అందంలో స్టార్ హీరోయిన్స్‌తో పోటీ పడుతోంది మిథాలీ పారుల్కర్.  ఆమె వ్యాపారవేత్త కాగా.. థానేలో ఆల్ ది బేక్స్ పేరుతో స్టార్టప్ కంపెనీని నడుపుతోంది. మిథాలీతో శార్దూల్ ఠాకూర్ చాలా కాలంగా డేటింగ్ చేశాడు.  

3 /5

వీరి హల్దీ వేడుక శనివారం జరిగింది. రోహిత్ శర్మ, అతని భార్య రితికా సజ్దే, శ్రేయస్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, భార్య ధనశ్రీ వర్మ కూడా వివాహ వేడుకకు హాజరయ్యారు.  

4 /5

టీమిండియా తరుఫున మూడు ఫార్మాట్లలోనూ ప్రాతినిధ్యం వహించాడు శార్దుల్ ఠాకూర్.  

5 /5

ఇప్పటివరకు 34 వన్డేలు, 25 టీ20లు, 8 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. కేవలం బాల్‌తోనే కాకుండా.. బ్యాట్‌తో కూడా రాణించగల సత్తా శార్దుల్‌కు ఉంది.