Cricket Marriages: క్రికెట్‌లో పెద్దోళ్లైనా...భార్యల కంటే వయస్సులో చిన్నోళ్లే

ప్రేమకు ఎప్పుడూ బలవంతం ఉండదు. అదెప్పుడు ఎవరిపై ఎలా పుడుతుందో తెలియదు. ప్రేమకు వయస్సు బేధం కూడా ఉండదు. ప్రేమ ప్రేమించబడుతుందంతే. టీమ్ ఇండియా క్రికెటర్లే ఇందుకు ఉదాహరణ. తమ భార్యల కంటే తక్కువ వయస్సున్న క్రికెటర్లెవరో చూద్దాం.

Cricket Marriages: ప్రేమకు ఎప్పుడూ బలవంతం ఉండదు. అదెప్పుడు ఎవరిపై ఎలా పుడుతుందో తెలియదు. ప్రేమకు వయస్సు బేధం కూడా ఉండదు. ప్రేమ ప్రేమించబడుతుందంతే. టీమ్ ఇండియా క్రికెటర్లే ఇందుకు ఉదాహరణ. తమ భార్యల కంటే తక్కువ వయస్సున్న క్రికెటర్లెవరో చూద్దాం.
 

1 /5

సురేష్ రైనా-ప్రియాంక చౌధరి... ఈ ఇద్దరి వయస్సు 5 నెలల 9 రోజులుంది. సురేష్ రైనా చిన్నోడు. 2015లో ఈ ఇద్దరి పెళ్లైంది. 

2 /5

శిఖర్ ధావన్- ఆయెషా ముఖర్జీలు 2012లో పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరి మధ్య పదేళ్ల వ్యత్యాసముంది. ఆయేషా ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు విడాకులు తీసుకుని ఉంది. అయితే గత ఏడాది ఈ ఇద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

3 /5

టీమ్ ఇండియా పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ..హసీన్ జహాను వివాహమాడాడు. ప్రస్తుతం ఈ ఇద్దరికీ విడాకులు కూడా అయిపోయాయి. అయితే మొహమ్మద్ షమీ కంటే హసీన్ ఏకంగా పదేళ్లు పెద్దది. విడాకుల తరువాత ఇద్దరూ మళ్లీ పెళ్లి చేసుకోలేదు.

4 /5

సచిన్ టెండూల్కర్-అంజలి మెహతా. అంజలి కంటే సచిన్ టెండూల్కర్ ఆరేళ్ల చిన్నోడు. ఇద్దరు పిల్లలున్నారు. 1995లో ఈ ఇద్దరి వివాహమైంది.

5 /5

జస్‌ప్రీత్ బూమ్రా - సంజనా గణేశన్. 2021 మార్చ్ 15వ తేదీన ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. బుమ్రా..సంజనా కంటే 2 ఏళ్ల 7 నెలలు చిన్నోడు.