Scary Rivers: నదులంటే సహజంగా ప్రశాంతతకు, ఆహ్లాదానికి మారుపేరుగా చెప్పుకుంటాం. నదీతీరాల్లో కాస్సేపు కూర్చుని సాయం వేళల్లో సేద తీరాలని అనుకుంటాం. కానీ ఆ ఐదు నదుల పేర్లు వింటేనే జనం భయపడిపోతారు. ప్రపంచంలోని అత్యంత భయంకరమైన, ప్రమాదకరమైన ఐదు నదులేంటో తెలుసుకుందాం..
Tarcoles River, Costa rica కోస్తారికా దేశంలోని తార్‌కోల్ నదిలో 2 వేల కంటే ఎక్కువ ముసళ్లు ఉన్నాయని అంచనా. ఎప్పుడూ నది ఒడ్డున సేద తీరుతూ ఉంటాయి. ఈ నది ఒడ్డుకు పొరపాటున కూడా వెళ్లేందుకు ఎవరూ సాహసించరు
Rio Tinto River, Spain స్పెయిన్ దేశంలోని రియో టింటో నది భగభగమండే ఎరుపు రంగులో ఉంటుంది. ఇది అత్యంత కాలుష్యపు నది. ఈ నది కెమికల్ స్థాయి చాలా ఎక్కువ. అందుకే ఈ నది నీళ్లు తాగేందుకు ఎందుకూ పనికిరావు
Red River, USA దాదాపు 2 వేల 100 కిలోమీటర్ల పొడవైన రెడ్ రివర్ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన నదుల్లో ఒకటి. ఈ నదిని ఊహించడం కష్టం. ఎవరికీ అంతుబట్టదిది. ఒక్కోసారి ప్రశాంతంగా..అంతలోనే రౌద్రంగా ప్రవహిస్తుంటుంది.
Mekong River మెకాంగ్ నది దాదాపు 6 ఆసియా దేశాల గుండా ప్రవహిస్తుంది. ఈ నది ప్రమాదకరమైన జంతువులకు ఆవాసం కూడా. ఈ నది ప్రతియేటా చాలామంది ప్రాణాలు బలి తీసుకుంటుంది. ఈ నదికున్న అనూహ్య వరద కారణంగా జనం కొట్టుకుపోతుంటారు. ఇందులో ముసళ్లు కూడా ఉంటాయి.
Shanay Timpishka River, Peru పెరూ దేశంలోని శానే టింపిష్కా నదికి మరో పేరు బాయిలింగ్ రివర్. ఇందులో నీళ్లు ఎప్పుడూ హై టెంపరేచర్‌లో ఉడుకుతూ ఉంటాయి. ఇందులో ఉష్ణోగ్రత 2 వందల డిగ్రీల ఫారన్ హీట్ కంటే ఎక్కువ. జియో థర్మల్ ఎనర్జీ ఉన్న ఈ నది చాలా డేంజర్.