Sudden Weight gain: అకాస్మాత్తుగా బరువు పెరుగుతున్నారా..?.. వీటిని మాత్రం అస్సలు లైట్ తీసుకొవద్దు..

Sudden Weight Gain: కొంత మంది ఒక్కసారిగా అమాంతం బరువుపెరిగి పోతుంటారు. ఆహరపు అలవాట్లు, జీవన విధానం కూడా దీనికి కారణంగా చెప్తుంటారు.

1 /6

కొంత మంది ఒక్కసారిగా అమాంతం బరువు పెరిగిపోతుంటారు. దీని వల్ల అనేక సమస్యలు ఏర్పడతాయి. బరువు పెరగటం వల్ల బీపీ, షుగర్ వంటి సమస్యలు కూడా వస్తుంటారు. బరువు పెరగటం వెనుక మన ఆహరపు అలవాట్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.  

2 /6

కొందరు ప్రతిరోజు బైట దొరికే ఫుడ్ లను ఎక్కువగా తింటారు. పిజ్జాలు బర్గర్ లను ఎక్కువగా తింటారు.దీని వల్ల శరీరంలో ఆయిల్ ఎక్కువగా పొతుంది. దీనివల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ సమస్య ఏర్పడుతుంది.  

3 /6

చాలా మంది సమయానికి అస్సలు నిద్రపోరు. ఇలా చేయడం వల్ల కూడా అధిక కొవ్వుతో బాధపడుతుంటారు. టైమ్ కు నిద్రపోకున్నా.. అతిగా నిద్రపోయిన కూడా అధిక బరువు సమస్యలు ఏర్పడతాయి. దీనివల్ల శరీరంలోని ఇతర అవయవాలు దెబ్బతింటాయి.

4 /6

సోఫాలో కూర్చుని గంటల కొద్ది పడుకుని ఉంటారు. టీవీలు చూస్తు రోజంతా గడిపేస్తుంటారు. దీని వల్ల శరీరంలో పొట్ట భాగంలో, పిరుదుల భాగంలో కూడా చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయి ఉంటుంది. దీని వల్ల వైవాహిక జీవితంలో కూడా అనేక సమస్యలు ఏర్పడతాయి.

5 /6

శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం కూడా ఎంతో ముఖ్యమని నిపుణులు చెబుతుంటారు. అందుకే కొందరు తరచుగా  రెస్ట్ తీసుకుంటారు. ఇది ఒక పరిధిని దాటకూడదని మాత్రం నిపుణులు చెబుతుంటారు. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రంపూట ఒక అరగంట పాటు వ్యాయమం చేసేలా ప్లాన్ లు చేసుకొవాలి.  

6 /6

బైటదొరికే జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ ను ఎక్కువగా తినడం పూర్తిగా మానేయాలి. దీని వల్ల జీవన విధానంలో పెనుమార్పులు సంభవిస్తాయి. యోగా, రన్నింగ్, వాకింగ్ లుచేయడం వల్ల కూడా శరీరంలో పెరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ వంటిది దూరమైపోతుంది. ఎక్కువగా ఫ్రూట్స్, మొలకెత్తిన చిరుధాన్యాలు తినడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)